Published On:

Ileana: మరోసారి తల్లి కాబోతోన్న బెల్లీ బ్యూటీ ఇలియాన – బేబీ బంప్‌ ఫోటోతో సర్‌ప్రైజ్‌

Ileana: మరోసారి తల్లి కాబోతోన్న బెల్లీ బ్యూటీ ఇలియాన – బేబీ బంప్‌ ఫోటోతో సర్‌ప్రైజ్‌

Ileana Announced Her Second Pregnancy: బెల్లీ బ్యూటీ ఇలియాన గుడ్‌న్యూస్‌ చెప్పింది. తాను మరోసారి తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది. తాజాగా ఆమె బేబీ బంప్‌తో ఉన్న ఫోటోని షేర్‌ చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ షేర్‌ చేసి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది. కొన్ని రోజులు ఇలియాన తన సెకండ్‌ ప్రెగ్నెన్సీ గురించి హింట్ ఇస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. తాను మళ్లీ తల్లిని కాబోతున్నట్టు ఈ ఏడాది జనవరిలో హింట్‌ ఇచ్చింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో అర్థరాత్రి ఫుడ్‌ క్రెవింగ్స్‌ అంటూ ‘మీరు గర్భవతి అని చెప్పకుండానే చెప్పండి’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది.

 

అయితే తను ప్రెగ్నెంట్‌ అనే విషయం చెప్పకుండ ఫాలోవర్స్‌ని డైలామాలో పడేసింది. ఇప్పుడు ఏకంగా బేబీ బంప్‌తో ఉన్న ఫోటో షేర్‌ చేసి అసలు విషయం చెప్పేసింది. తన స్నేహితురాలితో కలిసి దిగిన ఫోటోని షేర్‌ చేసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఈ ఫోటో ఇలియాన, తన స్నేహితురాలు ఇద్దరు బేబీ బంప్‌తో కనిపించారు. ఈ ఫోటోకి ‘బంప్‌ బడ్డీస్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కాగా 2023లో ఇలియాన తన ఫస్ట్‌ ప్రెగ్నెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే.

 

అయితే పెళ్లి ప్రకటన చేయకుండానే ఇల్లీ బేబీ తల్లికాబోతున్నట్టు ప్రకటించి విమర్శలు ఎదుర్కొంది. అయినా అవేవి పట్టించుకోకుండ.. మగబిడ్డకు పుట్టాడంటూ కొన్ని రోజులు తర్వాత బిడ్డను పరిచయం చేసింది. అంతేకాదు బిడ్డ పేరు ఫీనిక్స్‌ డోలన్‌ కూడా వెల్లడించింది. అయితే బిడ్డ పుట్టిన కొన్ని నెలల తర్వాత ఇలియాన తన భర్తను పరిచయం చేసింది. దీంతో ట్రోల్స్‌ చెక్‌ పడింది. చివరకు తన బాయ్‌ ఫ్రెండ్‌ మైఖేల్‌ డోలన్‌ తన భర్త అంటూ ప్రపంచానికి చెప్పింది. అప్పటి నుంచి తన కొడుకు, భర్తకు సంబంధించిన విషయాలను షేర్‌ చేసుకుంటూ మురిపోతుంది.

 

ఆ తర్వాత కొంతకాలంగా సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న ఇల్లీ బేబీ ఆ తర్వాత మరోసారి తల్లి కాబోతున్నట్టు హింట్‌ ఇస్తూ తాజాగా తన బేబీ బంప్‌ ఫోటో షేర్‌ చేసి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కాగా మైఖేల్‌ డోలన్‌ కంటే ఇలియా ఆస్ట్రేలియా ఫోటో గ్రాఫర్‌లో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు అతడితో సహాజీవనం చేసింది. లాంగ్‌ రిలేషన్‌ అనంతరం వీరిద్దరు బ్రేకప్‌ చెప్పుకుని విడిపోయారు. ఈ బ్రేకప్‌ తర్వాత ఇలియా డిప్రెషన్‌కు వెళ్లింది. కొన్నెళ్ల పాటు మీడియాకు, సోషల్‌ మీడియాకు దూరంగా ఉంది. కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిన ఆమె సడెన్‌ బాయ్‌ ఫ్రెండ్‌ మైఖేల్‌ని పరిచయం చేసింది.