Suriya and Jyothika: ‘స్వర్గంలో మరో రోజు మనిద్దరం’.. వెకేషన్‌లో సూర్య, జ్యోతిక!

Suriya and Jyothika Vacation Video: తమిళ్ స్టార్ హీరో సూర్యకు తమిళ ఫ్యాన్స్‌తో పాటు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. గజిని సినిమాతో తెలుగులో ఆకట్టుకున్న సూర్య.. వరుసగా డిఫరెంట్ పాత్రల్లో నటించి అందరినీ మెప్పించాడు. సినిమా పరిశ్రమలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోలో తను ఒక్కడు. ఇటీవల, రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, మంచి సూపర్ హిట్ అందుకుంది.
తాజాగా, హీరో సూర్య, తన భార్య జ్యోతికతో కలిసి వెకేషన్ వెళ్లారు. ఈస్ట్ ఆఫ్రికాలోని సీషెల్స్‌కు వెళ్లిన ఈ జంట విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో సముద్రంతో పాటు ప్రకృతి అందాలను అస్వాదిస్తున్నారు. ఈ విహార యాత్రకు సంబంధించి వీడియోను జ్యోతిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘స్వర్గంలో మరో రోజు మనిద్దరం’ అని జ్యోతిక రాసుకొచ్చారు.
ఇదిలా ఉండగా, సూర్య హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తుండగా.. సితార ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకంపై చేస్తుంది. ఇందులో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాతో పాటు సూర్య ఆర్జే బాలాజీ డైరెక్షన్‌లో కరుప్పు సినిమాలోనూ నటిస్తున్నారు.
View this post on Instagram