Published On:

Trance of Kuberaa: ధనుష్‌, నాగార్జునల కుబేర టీజర్‌ వచ్చేసింది.. విభిన్న షేడ్స్‌తో ఆకట్టుకుంటున్న టీజర్‌!

Trance of Kuberaa: ధనుష్‌, నాగార్జునల కుబేర టీజర్‌ వచ్చేసింది.. విభిన్న షేడ్స్‌తో ఆకట్టుకుంటున్న టీజర్‌!

Dhanush and Nagarjuna Kuberaa Teaser Out: తమిళ హీరో ధనుష్‌, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రలో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘కుబేర’. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం జూన్‌ 20న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్‌ కానుంది.

 

శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ LLP, అమిగోస్‌ క్రియేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్లపై సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. తమిళ అగ్ర హీరో ధనుష్‌, టాలీవుడ్‌ కింగ్‌ నాగర్జునలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో మూవీ టీం ప్రమోషన్స్‌ షూరూ చేసింది. ఇందులో భాగంగా ఈ తాజాగా కుబేర టీజర్‌ను (Kubera Teaser)విడుదల చేశారు.

 

ట్రాన్స్‌ ఆఫ్‌ కుబేర టీజర్..

ట్రాన్స్‌ ఆఫ్‌ కుబేర (Trance of Kuberaa – Teaser) పేరుతో విడుదల చేసిన ఈ టీజర్‌లో సినిమాను ఎలా ఉండబోతోందో చూపించాడు దర్శకుడు. జస్ట్‌ రెండు నిమిషాల ఈ వీడియో మూవీలోని ఇంటెన్సీని పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈ టీజర్‌ మూవీపై అంచనాలను మరింత రెట్టింపు చేస్తోంది. ఓ సాధారణ వ్యక్తి బికారిగా మారడం.. ఆ తర్వాత ఆ వ్యక్తి కుబెరుడి కనిపించడం ఇలా ఆసక్తికర అంశాలతో టీజర్‌ ఆద్యాంతం ఆకట్టుకుంటోంది. టీజరే ఈ రేంజ్‌లో ఉంటే ఇక ట్రైలర్‌ శేఖర్‌ కమ్ముల ఎలా ప్లాన్‌ చేసి ఉంటాడో చూడాలి. ప్రస్తుతం ఈ టీజర్‌ మూవీ మరింత బజ్‌ పెంచింది. క్రైం, థ్రిల్లర్‌గా సినిమా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు జిమ్‌ సర్భ్‌, దలిప్‌ తహిల్‌, దివ్య దేకటే, షయాజీ షిండే వంటి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. జూన్‌ 20, 2025న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.