Published On:

Telangana Rain Alert: వాతావరణశాఖ అలర్ట్… తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన

Telangana Rain Alert: వాతావరణశాఖ అలర్ట్… తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన

Rain Alert to Telangana: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు నేడు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటలకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, కొత్తగూడెం, ఖమ్మం, జగిత్యాల, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, వరంగల్, జనగామ, హన్మకొండ, మహబూబాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

 

మరోవైపు దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మే 13న అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు.. తాజాగా నిన్న కేరళలోకి ప్రవేశించాయని భారత వాతావరణశాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనంతో కేరళలో భారీగా వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో కేరళ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.