Published On:

CSK Vs GT PL 2025: చెలరేగిన చెన్నై బ్యాటర్లు.. గుజరాత్ లక్ష్యం ఎంతంటే..?

CSK Vs GT PL 2025: చెలరేగిన చెన్నై బ్యాటర్లు.. గుజరాత్ లక్ష్యం ఎంతంటే..?

GT Target is 230 against CSK: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ జైంట్స్ మధ్య కీలక పోరు జరుగుతోంది. కాగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు తమ చివరి లీక్ మ్యాచ్ లో చెలరేగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. బ్రేవీస్ (57), కాన్వే (52) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆయుష్ మాత్రే (34), ఉర్విల్ పటేల్ (37) కీలక సమయంలో రాణించారు. దీంతో చెన్నై జట్టు గుజరాత్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు తీసుకోగా.. సాయి కిషోర్, రషీద్ ఖాన్, షారుక్ ఖాన్ తలో వికెట్ దక్కించుకున్నారు.

 

కాగా టాస్ బ్యాటింగ్ ఆరంభించిన చెన్నై జట్టు ఫస్ట్ ఓవర్ నుంచే రెచ్చిపోయింది. ఓపెనర్ ఆయుష్ మాత్రే రెండో ఓవర్లోనే 28 పరుగులు రాబట్టి జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించాడు. మాత్రే బ్యాటింగ్ తో చెన్నై జట్టు పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 68 పరుగులు రాబట్టింది. మాత్రే ఔటయ్యాక ఉర్విల్ పటేల్, కాన్వే జట్టును అదే స్థాయిలో నడిపించారు. ఉర్విల్ గుజరాత్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. కేవలం 19 బంతుల్లోనే 37 పరుగులు చేసి వెనుదిరిగాడు.

 

దూబే, కాన్వే ఔటయ్యే సమయానికి చెన్నై పటిష్ట స్థితికి చేరింది. టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న బ్రేవీస్ భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. దీంతో చెన్నై స్కోర్ నిర్ణీత 20 ఓవర్లలో 230 పరుగులకు చేరింది. మరోవైపు క్వాలిఫయర్-1 చేరాలంటే గుజరాత్ ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలిచి తీరాలి. మరి చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని గుజరాత్ చేరుకుంటుందో లేదో చూడాలి.