Published On:

Actress Sharmin Segal: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘హీరామండి’ నటి

Actress Sharmin Segal: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘హీరామండి’ నటి

Actress Sharmin Segal Blessed With Baby Boy: ‘హీరామండి’ వెబ్‌ సిరీస్‌తో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా నిలిచింది నటి షర్మిన్‌ సెగల్‌. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలి మేనకోడలైన షెర్మిన్‌ మలాల్‌ అనే చిత్రంలో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. కానీ, హీరామండితోనే ఆమె నటిగా గుర్తింపు పొందింది. అంతకు ముందు తన మేనమామ సంజయ్‌ లీలా భన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన రామ్‌లీలా, బాజిరావ్‌ మాస్తానీ, మేరీ కోమ్‌ వంటి చిత్రాలకు ఆమె అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిది.

 

ఆ తర్వాత మలాల్‌ సినిమాతో నటిగా వెండితెర ఆరంగేట్రం చేసిన ఆమె హీరామండి వెబ్‌ సిరీస్‌లో కీలక పాత్రలో నటించి ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారింది. ఈ వెబ్‌ సిరీస్‌లో ఆమె మరే సినిమాలో కనిపించలేదు. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన గుడ్‌న్యూస్‌ బయటకు వచ్చింది. షర్మిన్‌ సెగల్‌ తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె ప్రకటించలేదు. కానీ షెర్మిన్‌ బాబు జన్మనిచ్చినట్టు జర్నలిస్ట్‌ విక్కీ లాల్వానీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. మే 28న ఆమె తల్లిగా ప్రమోట్‌ అయినట్టు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమెకు పెళ్లి ఎప్పుడైందని షాక్‌ అవుతున్నారు.

 

ఏదేమైన తల్లిగా ప్రమోట్‌ అయిన షెర్మిన్‌కు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా షెర్మిన్‌ 2023లో అమన్‌ మెహతాను పెళ్లాడింది. ఇటలీలో ఇరుకుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం అహ్మదాబాద్‌లో ఉన్న ఆమె ఈ మధ్యే ముంబైకి షిఫ్ట్‌ అయ్యింది. ఇక షెర్మిన్‌ చివరిగా తన మేనమామ సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి: ది డైమండ్‌ బజార్‌లో నటించింది. ఈ సిరీస్‌లో ఆలం జేబ్‌ పాత్రలో నటించి ఆకట్టుకుంది. అయితే ఆమె నటనపై కొందరు విమర్శలు గుప్పించగా.. మరికొందరు ప్రశంసలు కురిపించారు. మొత్తానికి ఈ వెబ్‌ సిరీస్‌లో ఆమె లైమ్‌లైట్లోకి వచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Vickey Lalwani (@iamvickeylalwani)