Published On:

Samantha-Raj Nidimoru: ‘కాలం నిర్ణయిస్తే.. కర్మ సరిదిద్దుతుంది’ – డైరెక్టర్‌ రాజ్‌ నిడిమోరు భార్య పోస్ట్‌ వైరల్‌

Samantha-Raj Nidimoru: ‘కాలం నిర్ణయిస్తే.. కర్మ సరిదిద్దుతుంది’ – డైరెక్టర్‌ రాజ్‌ నిడిమోరు భార్య పోస్ట్‌ వైరల్‌

Raj Nidimoru Wife Shhyamali De shares cryptic post: స్టార్‌ హీరోయిన్‌ సమంత ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తన సినిమా శుభం మూవీ నుంచి ఆమె చేసే పోస్ట్స్‌ హాట్‌టాపిక్‌ అవుతున్నాయి. దానికి కారణం ఆమె డైరెక్టర్‌ రాజ్‌ నిడిమోరుతో ఫోటో షేర్‌ చేయడమే. శుభం మూవీ ప్రమోషన్స్‌ చేస్తూనే.. ఓ వైపు రాజ్‌ నిడిమోరుతో డేటింగ్‌ వార్తలపై హింట్‌ ఇస్తూ వస్తుంది. ఆయనతో ఉన్న ఫోటోలు, విమానంలో ఆయన భుజంపై వాలి దిగిన ఫోటోలను షేర్‌ చేసింది.

 

రాజ్‌ నిడిమోరుతో సామ్‌ ఫోటోలు షేర్‌ చేస్తున్న సమయంలోనే మరోవైపు ఆయన భార్య శ్యామలి డే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తోంది. ఇది వారి డేటింగ్‌ రూమర్స్‌ని ఉద్దేశించేలా ఉండటంతో ఆమె పోస్ట్స్‌ హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా సామ్‌ తను జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న ఫోటోలు షేర్‌ చేసింది. ఇందులో డైరెక్టర్‌ రాజ్‌ నిడిమోరుతో కలిసి పికిట్‌ బాల్‌ ఆడుతున్న వీడియోను కూడా షేర్‌ చేసింది. సామ్‌ పోస్ట్ చేసిన కాసేపటికే రాజ్‌ నిడిమోరు భార్య శ్యామలి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షాకింగ్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. “అన్నింటినీ కాలమే నిర్ణయిస్తుంది. కర్మ వాటిని సరిదిద్దుతుంది. విశ్వం వినయాన్ని నేర్పిస్తుంది” అని ఉన్న పోస్ట్‌ పెట్టింది.

 

దీంతో ఇది సామ్‌, రాజ్‌ నిడిమోరులను ఉద్దేశించే చేసిందని అంతా అభిప్రాయపడుతున్నారు. ఇలా మౌనంగా ఉంటూనే సామ్‌ను తన పోస్ట్స్‌ ద్వారా విమర్శిస్తోందని అంటున్నారు నెటిజన్స్‌. అయితే రాజ్‌ నిడిమోరు, సమంత డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్ని పుకార్లేనని సామ్‌ మేనేజన్‌ చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ సమంత, రాజ్‌లు మాత్రం ఈ వార్తలపై స్పందించడం లేదు. కానీ, వారు మాత్రం తరచూ జంటగా కెమెరా కంట పడుతున్నారు. మరోవైపు సమంత కూడా వారిద్దరి పోస్ట్స్‌ షేర్‌ చేస్తూ వస్తోంది.

 

చివరికి ఈ రూమర్స్‌ సామ్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతుందనేది మాత్రం అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. కాగా సమంత నిర్మించిన శుభం మూవీ ప్రొడక్షన్‌లోనూ రాజ్‌ నిడిమోరు భాగమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో రూపొందుతోన్న రక్త్‌ బ్రహ్మాండ్‌లో సమంత నటిస్తోంది. ప్రస్తుతం మూవీ షూటింగ్‌ దశలో ఉంది. ఇందులో ఆదిత్య రాయ్‌ కపూర్‌, వామికా గబ్బి, అలీ ఫజల్‌, జైదీప్‌ అహ్లవత్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.