Last Updated:

Second Single from Hari Hara Veeramallu: పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌కి వాలెంటైన్స్‌ డే సర్‌ప్రైజ్‌ – హరి హర వీరమల్లు సెకండ్‌ సింగిల్‌ అప్‌డేట్‌ వచ్చేసింది!

Second Single from Hari Hara Veeramallu: పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌కి వాలెంటైన్స్‌ డే సర్‌ప్రైజ్‌ – హరి హర వీరమల్లు సెకండ్‌ సింగిల్‌ అప్‌డేట్‌ వచ్చేసింది!

Pawan Kalyan’s Hari Hara Veeramallu Second Single Update: పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాన్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ ‘హరిహర వీరమల్లు’. మార్చిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌తో పాటు ప్రమోషన్స్‌ జోరు పెంచింది. ఇప్పటికే ఈ చిత్రంనుంచి విడుదలైన పోస్టర్స్‌, ఫస్ట్‌ సింగిల్‌, వీడియోలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ పాడిన వినాలి వీరమల్లు మాట వినాలి అంటూ సాగే ఈ పాటకు విశేష స్పందన వచ్చింది.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది మూవీ టీం. ఈ మేరకు హరి హర వీరమల్లు టీం ఓ ప్రకటన ఇచ్చింది. హీరోహీరోయిన్లు పవన్‌ కళ్యాణ్‌, నిధి అగర్వాల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసి సెకండ్‌ సింగిల్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. “పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ గెట్‌ రెడీ. హరి హర వీరమల్లు మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ వచ్చేస్తోంది. ఈసాంగ్‌ మీ మనసులను దోచేస్తుంది. మీ క్యాలెండర్‌లో ఫిబ్రవరి 24ను మార్క్‌ చేసుకోండి” అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

‘కొల్లగొట్టిందిరో’ అంటూ సాగే ఈ పాటను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన హీరోహీరోయిన్లు పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. ఇందులో నిధి అగర్వాల్‌ యువరాణిలో మెరిసిపోయింది. ఆమె వెనకాల వీరమల్లు నడుస్తూ కనిపించారు. చూస్తుంటే ఇది రొమాంటిక్‌ సాంగ్‌ అని, హీరోయిన్‌ని ఉద్దేశిస్తూ హీరో తన ప్రేమను వ్యక్తం చేస్తూ సాగే పాట అని తెలుస్తోంది. హరి హర వీరమల్లు పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. బడుగులకు అండగా నిలబడే ఓ పోరాట యోధుడిగా ఇందులో పవన్‌ కళ్యాణ్‌ కనిపించబోతున్నారు. హరి హర వీరమల్లు కథ 16వ శతాబ్ధం బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని సమాచారం. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణాంతర పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చి 28న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి: