Jailer 2: రజినీ పక్కన బాలయ్య అలా నడుచుకుంటూ వస్తుంటే.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే

Jailer 2: ఒక స్టార్ హీరో సినిమాలో ఇంకో స్టార్ హీరో కనిపిస్తే ఆ కిక్కే వేరు. ఈ మధ్య స్టార్ హీరోలు.. ఇలాంటి క్యామియోల కోసం ఇతర భాషల హీరోలను దింపుతున్నారు. దీనివలన ఆ భాషలో కూడా హైప్ వస్తుంది. ప్రమోషన్స్ కూడా కలిసి వస్తాయి అని ఆలోచిస్తున్నారు. సరే.. కుర్ర హీరోల సినిమాల్లో సీనియర్ హీరోలు. సీనియర్ హీరోల సినిమాల్లో కుర్ర హీరోలు క్యామియోలు ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
అయితే ఈసారి మాత్రం ఇందుకు భిన్నంగా ఒక అరుదైన కలయిక వెండితెరపై మెరవనుంది. ఇలాంటివి జరగడం రేర్. కానీ, ఈ అరుదైన కలయికను సాధ్యం అయ్యేలా చేశాడు కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. ప్రస్తుతం అతను దర్శకత్వం వహిస్తున్న చిత్రం జైలర్ 2. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
జైలర్ సినిమాతో రజినీ ఇండస్ట్రీ హిట్ అందుకున్న విషయం తెల్సిందే. అందులో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ క్యామియోలో కనిపించారు. ఇక జైలర్ 2 లో కూడా కన్నడ హీరో శివన్న కనిపిస్తున్నాడు. ఇక తాజాగా నందమూరి నట సింహం బాలకృష్ణ .. జైలర్ 2 లో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే రజినీ ఒక పక్క.. బాలయ్య ఇంకోపక్క నడిచి వస్తుంటే థియేటర్ లో ఏ ఒక్కరు సీట్లో కూర్చోరు అన్నది వాస్తవం.
జైలర్ లో స్టార్ హీరోల క్యామియోలను ఎలా వాడుకున్నాడో.. నెల్సన్ ఈసారి అంతకుమించి వాడబోతున్నాడట. ఇప్పటికే టైగర్ అనే సినిమాలో పెద్ద ఎన్టీఆర్ తో కలిసి రజినీ కనిపించాడు. ఇక ఇన్నేళ్ల తరువాత బాలయ్య.. రజినీ కలిసి కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.