Schools Bandh: రేపు రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు బంద్

Private Schools bandh In AP: రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్లు బంద్ చేస్తున్నట్టు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ పిలుపునిచ్చింది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ఆవేదన అందరికీ తెలిసేలా కార్యక్రమానికి అందరి సహకారంతో కార్పొరేట్ స్కూళ్లు సిద్ధం కావాలని కోరారు. కొందరు అధికారులు తనిఖీలు, నోటీసుల పేరుతో వేధిస్తున్నారని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఆరోపించాయి. రాష్ట్రంపై ఆర్థిక భారం పడకుండా 55 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులకు సేవలందిస్తున్నట్టు పేర్కొంది. అందుకే రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ స్కూళ్లు బంద్ చేస్తున్నట్టు అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్య అసోసియేషన్ కోరింది.
బంద్ కు అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరింది. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా రేపటి బంద్ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ సహకరించాలని తెలిపింది.