The Raja Saab Movie Team: పోలీస్ స్టేషన్ కు రాజాసాబ్ మూవీ టీమ్

The Raja Saab Teaser Leaked: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ రాజాసాబ్. ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న ఈ మూవీపై అటు మూవీ టీమ్, ఇటు ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెంచుకున్నారు. ప్రభాస్ కెరీర్ లోనే తొలిసారిగా హారర్ రొమాంటిక్ కామెడీ మూవీని చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 16న మూవీకి సంబంధించి టీజర్ రిలీజైంది. కాగా టీజర్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఎంతలా అంటే టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 59 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది.
అంతా బాగానే ఉంది. కానీ ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేయడానికి మూడు రోజుల ముందే కొందరు దీనిని సోషల్ మీడియాలో లీక్ చేశారు. దీనిపై మూవీ ప్రొడ్యూసర్స్ సీరియస్ గా ఉన్నారు. భారీగా ఖర్చు చేసి నిర్మిస్తున్న సినిమా ఫుటేజ్ బయటకు వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజాసాబ్ టీజర్ లీక్ చేసిన వారిపై మూవీ టీమ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సినిమా డబ్బింగ్ ఇంఛార్జ్ వసంత్ కుమార్ పోలీసులను కోరారు. దీంతో కేసు నమోదు చేసుకున్నారు.