Mukesh Khanna: రజినీకాంత్‌లా వారు ఉండలేరు.. శక్తిమాన్ సంచలన వ్యాఖ్యలు

Mukesh Khanna: బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా గురించి తెలుగువారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది చిన్నపిల్లల పాలిట దేవుడు అతను. శక్తిమాన్ సీరియల్ తో ప్రేక్షకులను అలరించి మెప్పించాడు. ఇక ఈ సీరియల్ తో పాటు పలు సినిమాలలో కూడా నటించి మెప్పించిన ముఖేష్ ఖన్నా.. గత కొంతకాలంగా వివాదాలతో జీవిస్తున్నాడు. వరుస ఇంటర్వ్యూలను ఇస్తూ.. హాట్ టాపిక్స్ పై తన అభిప్రాయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. అవి కొన్ని సార్లు మిస్ ఫైర్ అయ్యి సోషల్ మీడియాలో వివాదాలకు దారితీస్తున్నాయి.
ఇక తాజాగా ముఖేష్ ఖన్నా బాలీవుడ్ నటులను కించపరుస్తూ మాట్లాడాడు. వారికన్నా సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంతో బెటర్ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ నటులెవ్వరు కూడా రజినీలా ఉండలేరని, ఆయన రియల్ స్టార్ అని చెప్పుకొచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ముఖేష్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
“బాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్ హీరోస్ కంటే రజినీకాంత్ చాలా గొప్ప వ్యక్తి. ఆయనలా ఉండడం ఎవరివలన కాదు. ఎంతో సింపుల్ గా కనిపిస్తారు. బయటకు వచ్చేటప్పుడు మేకప్ వేసుకోరు.. కనీసం విగ్ కూడా పెట్టుకోరు. ఫ్యాన్స్ ను కలిసినా కూడా చాలా సింపుల్ గా కలిసి మాట్లాడతారు. బాలీవుడ్ స్టార్ హీరోలు అలా కాదు. ఎక్కడికి వెళ్లాలన్నా మేకప్ ఉండాల్సిందే. ముంబైలో తిరగాలన్నా కూడా వారికి మేకప్ ఉండాలి. వ్యక్తిగతంగా ఇప్పటివరకు నేను రజినీని కలవలేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ముఖేష్ ఖన్నా చెప్పినదాంట్లో ఎలాంటి అబద్దం లేదు. రజినీ చాలా సింపుల్ వ్యక్తి. ఎప్పుడు ఆడంబరాలకు పోయినట్లు దాఖలాలు లేవు. కుటుంబంతో బయటకు వచ్చినా.. పెళ్ళికి, ఫంక్షన్ కు వెళ్లినా.. చాలా సింపుల్ గా ఒక కుర్తాతో వెళ్ళిపోతారు. అందుకే రజినీ అంటే అభిమానులకు అంత ఇష్టం. ప్రస్తుతం రజినీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఆయన నటించిన కూలీ, జైలర్ 2 సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మరి ఈ సినిమాలతో రజినీ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.