Published On:

Venkatesh: రజినీకాంత్ ఇచ్చిన సలహా.. ఇప్పటికీ అదే పాటిస్తున్నాను

Venkatesh: రజినీకాంత్ ఇచ్చిన సలహా.. ఇప్పటికీ అదే పాటిస్తున్నాను

Venkatesh: విక్టరీ వెంకటేష్.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా మొదటిసారి వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ సినిమా తరువాత వెంకీ మామ మార్కెట్ కూడా బాగా పెరిగింది. ఇక ప్రస్తుతం వెంకీ.. మెగా 157 లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇది కాకుండా త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేకుండా.. ఫ్యాన్స్ అందరూ ఇష్టపడే హీరో వెంకీ మామనే. సినిమా హిట్ అయితే పొంగిపోవడం… ప్లాప్ అయితే కుంగిపోవడం వెంకీకి అలవాటు లేదు. అంతేకాకుండా పబ్లిసిటీ గురించి ఎక్కువ పట్టించుకోడు. తాను ఇలా ఉండడానికి కారణం సూపర్ స్టార్ రజినీకాంత్ అని వెంకీ చెప్పుకొచ్చాడు.

 

తాజాగా ఒక తమిళ ఇంటర్వ్యూలో వెంకీ మాట్లాడుతూ.. ” నాకు , రజినీకాంత్ గారికి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. నేను ఆయన నుంచి ఎన్నో మంచి విషయాలను నేర్చుకున్నాను. ఆయన మా నాన్నతో కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు రజినీకాంత్ నాకో మాట చెప్పారు. సినిమా రిలీజ్ సమయంలో మన సినిమాకు బ్యానర్ కట్టారా.. ? ఆ పోస్టర్స్ లో మన ముఖం బాగా కనిపిస్తుందా.. ? మ్యాగజైన్ ఫ్రంట్ పేజీలో మన ఫోటో వచ్చిందా ..? ఇలాంటివేమీ ఆలోచించకూడదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడమే అని చెప్పారు.

 

ఇప్పటికీ నేను అదే ఫాలో అవుతున్నాను. ఏరోజు కూడా నేను పబ్లిసిటీ గురించి పట్టించుకోలేదు. దేనిగురించి కూడా ఎక్కువ ఆలోచించను. చిన్నతనం నుంచే నాకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. అరుణాచలం అంటే నాకు చాలా ఇష్టం. రమణ మహర్షిని నేను ఆరాధిస్తాను. దేవుడంటే నాకు భయం. ఎన్నో భక్తి పుస్తకాలు చదువుతాను. ఘర్షణ సమయంలో పడవ బోల్తా పడింది. అప్పుడు దేవుడే మమ్మల్ని రక్షించాడని అనుకుంటాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.