Rajinikanth About Jayalalitha : జయలలిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు – అందుకే ఆమెను వ్యతిరేకించా: రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు

Rajinikanth Finally Breaks Silence on Controversial Speech Against Jayalalitha: దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితపై గతంలో తాను చేసిన కామెంట్స్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. మాజీ మంత్రి ఆర్.ఎం వీరప్పన్ పట్ల జయలలిత వ్యవహరించిన తీరు తనని అలా మాట్లాడేలా చేసిందన్నారు.
జయలలితపై తీవ్ర విమర్శలు
1996 తమిళనాడు శాసన సభ ఎన్నికల సమయంలో జయలలితకు వ్యతిరేకంగా ఆయన ప్రసంగించారు. జయలలిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “మళ్లీ జయలలిత అధికారంలోకి వస్తే దేవుడు కూడా తమిళనాడును రక్షించలేడు’ అని ప్రకటన చేశారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు రాజకీయపరంగా తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు ఆ ఎన్నికల్లో జయలలిత అధికారం కోల్పోవడానికి కారణం అయ్యాయి. దాంతో ఇద్దరి మధ్య కొన్నేళ్ల పాటు రాజకీయ వైర్యం కోనసాగింది. అయితే తాజాగా ఈ వివాదంపై రజనీ స్పందించారు.
నా వల్లే ఆయన పదవి పోయింది: రజనీ
సినీ నిర్మాత, తమిళనాడు మాజీ మంత్రి ఆర్.ఎం వీరప్పన్‌కు, రజనికాంత్‌కు మధ్య మంచి స్నేహబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. సత్యమూవీస్ బ్యానర్ ద్వారా వీరప్పన్ ఎన్నో రజనీ చిత్రాలు నిర్మించారు. రజనీ సినీ కెరీర్‌లోనే మైలురాయిగా ఉన్న బాషా చిత్రాన్ని ఆయనే నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో 100 రోజుల ఆడి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. బాషా 100 రోజుల వేడుకలో రజనీకాంత్ మాట్లాడుతూ రాజకీయపరమైన కామెంట్స్ చేశారు. ‘తమిళనాడులో వారసత్వ రాజకీయాల పరంగా బాంబు సంస్కృతిపెరిగిపోయిందన్నారు. రాష్ట్రం ఓ స్మశానంలా మారింది’ అని విమర్శించారు. అదే సమయంలో జయలలిత సీఎంగా ఉన్నారు.
వీరప్పన్ ‘రియల్ కింగ్ మేకర్’
ఆమె కాబినెట్‌లోనే నిర్మాత ఆర్.ఎం వీరప్పన్ మంత్రి పదవిలో ఉన్నారు. రజనీ చేసిన ఈ కామెంట్స్ జయలలిత కోపానికి కారణం అయ్యాయి. దీంతో వీరప్పన్ మంత్రి పదవి నుంచి తొలగించారు. అయితే ఈ విషయం తెలిసి రజనీకాంత్ చాలా బాధపడ్డారట. ఆ కారణంతోనే 1996 శాసన సభ ఎన్నికల్లో జయలలితను విమర్శించడానికి కారణమని అన్నారు.గతేడాది వీరప్పన్ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన జీవితాన్ని ఆధారం తీసుకుని ‘ఆర్‌వీఎం: ది కింగ్ మేకర్’ పేరుతో డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీలో రజనీ వీరప్పన్ వ్యక్తిత్వం ఎలాంటిదో చెబుతూ జయలలితో ఉన్న వివాదంపై ప్రస్తావించారు.
జయలలిత వల్ల రాత్రంత నిద్రపోలేదు
“నేను జయలలితను వ్యతిరేకించడానికి వ్యక్తిగత కారణాలు ఏం లేవు. తమిళనాడు ప్రజల కోసం, ఆ రోజుల్లోని పరిస్థితులను బట్టి అలా మాట్లాడాను. అయితే నా స్పీచ్ తర్వాత వీరప్పన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించారు జయలలిత. అది తెలిసి చాలా బాధపడ్డాను. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. తెల్లారి వీరప్పన్‌కి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాను. దీని గురించి జయలలితతో కూడా మాట్లాడతాను అన్నాను. దానికి వీరప్పన్ అంగీకరించలేదు. ‘నువ్వు మాట్లాడిన లాభం ఉండదు. జయలలిత తన నిర్ణయాన్ని మార్చుకోరు. నా కోసం నువ్వు వెళ్లి నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. నాకు ఏ పదవి అవసరం లేదు. దాని కోసమే ఫోన్ చేస్తే ఈ మ్యాటర్‌ని ఇక్కడితో వదిలేయ్. మన సినిమాల గురించి మాట్లాడు’ అని అసలేం జరగనట్టుగా ఉన్నారు. మంత్రి పదవి పోయిన ఆయన ఏమాత్రం కలత చెందలేదు. అందుకే ఆర్‌ఎంవీ అద్భుతమైన వ్యక్తి. అందుకే ఆయన రియల్ కింగ్ మేకర్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన తేలికగా తీసుకున్నా.. నేను మాత్రం చాలా బాధపడ్డాను. అదే జయలలితకు వ్యతిరేకంగా మాట్లాడాటానికి కారణం అయ్యింది” రజనీ చెప్పుకొచ్చారు.