Nayanthara: ఇకపై నన్ను అలా పిలవకండి – ఫ్యాన్స్, మీడియాకు నయనతార విజ్ఞప్తి

Nayantha Request Fans and Media: రెండు దశాబ్ధాలకు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది నయనతార. దక్షిణాదిలో గ్లామర్స్, లేడీ ఒకరియంటెడ్, ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు హీరోల రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటూ లేడీ సూపర్ స్టార్ అని పిలుపించుకుంటుంది. నయన్‌ను అభిమానులు ముద్దుగా లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తనని అలా పిలవద్దు అంటుంది నయన్. ఈ మేరకు మీడియా, ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ ఓ పత్రిక ప్రకటన ఇచ్చింది.
నటిగా నా ప్రయాణంలో నా ఆనందానికి, విజయానికి కారణమైన మీ అందరికీ ధన్యవాదాలు. నా జీవితం తెరిచిన పుస్తకం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మీ నిస్వార్థమైన ప్రేమ, ఆప్యాయతలతో నా జీవితం సంతోషం ఉంది. నాకు విజయం వచ్చినప్పుడు భుజం తడుతూ, కష్టం వచ్చినప్పుడు మద్దతు తెలుపుతూ.. ఇలా ఎప్పుడూ నా కోసం మీరు ఉన్నారు. మీరు ఎంతో ప్రేమతో ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్ బిరుదుకు నేను రుణపడి ఉంటాను. కానీ, నన్ను నయనతార అని పిలిస్తేనే నాకు సంతోషం. ఇలాంటి బిరుదుల వల్ల సౌకర్యంగా ఉండలేను. నయనతార నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. నేను ఎవరో నాకు తెలియజేస్తుంది. కేవలం ఒక నటిగా ఇది చెప్పడం లేదు ఒక వ్యక్తిగా చెబుతున్నాను” అని ప్రకటనలో పేర్కొంది.
NAYANTHARA will always be and only NAYANTHARA🙏🏻 pic.twitter.com/fZDqhXM4Vl
— Nayanthara✨ (@NayantharaU) March 4, 2025