Nayanthara Buy Luxury Bungalow: లగ్జరీ బంగ్లా కొన్న నయనతార దంపతులు- 7 వేల చదరపు అడుగుల విస్తీర్ణం, ధరెంతో తెలుసా?

Nayanthara and Vignesh Shivan Buy Colonial Style Studio: హీరోయిన్ నయనతార ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా హీరో ధనుష్‌తో వివాదంతో ఆమె హాట్‌టాపిక్‌గా మారింది. అయితే సౌత్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నయన్ ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేసింది. ఏడాది మూడు నాలుగు సినిమాలు చేసేది. కానీ ఇప్పుడు ఆమె చేతిలో పెద్దగా ఆఫర్స్ ఏం లేవు. ఇటీవల తమిళంలో ఓ చిత్రానికి కమిట్ అయ్యింది. ప్రస్తుతం తన ఇద్దరి పిల్లల ఆలన పాలన చూసుకుంటోంది. ఈ ఖాళీ టైంని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఈ మధ్య భర్త, పిల్లలతో కలిసి విదేశాలు చూట్టేస్తోంది.
పోయెస్ గార్డెన్‌లో లగ్జరీ బంగ్లా
ఇదిలా ఉంటే ఇప్పుడు నయన్ గురించిన ఓ ఆసకర వార్త బయటకు వచ్చింది. చెన్నైలో ఓ విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేసిందట. రాజసం ఉట్టిపడేలా ఉన్న ఈ బంగ్లా ఖరీదు, విస్తీర్ణం తెలిసి అంతా అవాక్కావుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్ధాలుగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది నయన్. ఈ క్రమంలో నటిగా ఎంతో ఫేం, క్రేజ్‌ను సంపాదించుకుంది. అదే విధంగా ఆస్తులు కూడా బాగానే కూడబెట్టుకుంది. వ్యాపార రంగంలోనూ బాగా సంపాదిస్తోంది. ఇదిలా ఇప్పుడామె చెన్నైలో ఖరీదైన లగ్జరీ బంగ్లా కోనుగోలు చేసింది. సెలబ్రిటీలు నివసించే ఖరీదైన పోయెస్ గార్డెన్‌లో భర్తతో కలిసి కొత్త ఇంటిని సొంతం చేసుకుంది.
స్టూడియోగా డిజైన్
మూడు అంతస్తులు ఉండే ఈ బంగ్లాను రాజసం ఉట్టిపడేలా డెకరేట్ చేయించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను నయనతార, విఘ్నేష్ శివన్‌లు స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మూడు అంతస్తులు ఉండే ఈ ఇంటి గ్రౌంట్ ఫ్లోర్‌ను స్టూడియోగా మార్చారు. పైన ఇల్లుకు తగ్గట్టుగా డిజైన్ చేయించారట. తమ ఇష్టాలకు, అభిరుచి తగ్గట్టుగా ఈ బంగ్లాను నయన్, విఘ్నేష్‌లు దగ్గరుండి డిజైన్ చేయించారట. మొత్తం 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటి ఖరీదు సుమారు రూ. 100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. కాగా నయనతార ఇటీవల తన డాక్యుమెంటరీతో వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ నయతారపై డాక్యుమెంటరీ రూపొందించింది.
ధనుష్ తో వివాదం ఇది
‘నయనతార: బియాండ్ ది ఫెయిర్‌టెల్’ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీదాన్ చిత్రంలోనే మూడు సెకన్ల క్లిప్ వాడినందుకు హీరో ధనుష్ నయన్, విఘ్నేష్‌లపై కాపీరైట్ దావా వేశాడు. తన అనుమతి లేకుండ తన చిత్రంలోనే క్లిప్ వాడినందుకు నయనతార రూ. 10 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నోటీసులు ఇచ్చాడు. ఈ నోటీసులకు ఆమె స్పందించకపోవడంతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయమైన కోర్టు నయన్ దంపతులు అనుమతి ఇవ్వాల్సింది ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆమె భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతిలు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ధనుష్ నిర్మాతగా వ్యవహరించారు. ఇదే సెట్‌లో విఘ్నేష్, నయన్‌లకు పరిచయం ఏర్పడింది. అదే టైంలో వారిద్దరు ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే ఈ చిత్రంలోని క్లిప్‌ను తన డాక్యుమెంటరీలో వాడినట్టు నయన్ పేర్కొంది.
View this post on Instagram