Last Updated:

Bulli Raju: బుల్లిరాజు డిమాండ్.. ఒక్క రోజుకు అంత తీసుకుంటున్నాడా.. ?

Bulli Raju: బుల్లిరాజు డిమాండ్.. ఒక్క రోజుకు అంత తీసుకుంటున్నాడా.. ?

Bulli Raju: సినిమా ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎప్పుడు వస్తుంది అనేది చెప్పడం  చాలా కష్టం. కొంతమంది ఒక్క సినిమాతోనే పాపులర్ అవుతారు. ఇంకొంతమంది సినిమాలు చేస్తూ చేస్తూ ఒక పాత్ర వారిని పాపులర్ చేస్తుంది. ఈ రెండు  కేటగిరీలకు  ఈమధ్య రిలీజ్ అయిన సినిమాలోని నటులే ఉదాహరణ. కోర్ట్ సినిమాతో శివాజీ ఇన్నాళ్లకు మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించిన శివాజీ.. ఎన్నో సినిమాలు చేస్తూ చేస్తూ ఇప్పుడు అసలు సిసలైన సక్సెస్ ను అందుకున్నాడు.

 

ఇక ఇంకొక కేటగిరి.. మొదటి సినిమాతోనే పాపులర్ అవ్వడం. దానికి ఉదాహరణ చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్.. అదేనండీ మన బుల్లిరాజు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ కొడుకు బుల్లిరాజుగా రేవంత్ నటనకు టాలీవుడ్ మొత్తం ఫిదా అయ్యారు. చిన్న చిన్న రీల్స్ చేస్తూ.. జనసేన ప్రచారం బుల్లి కార్యకర్తగా తిరిగిన రేవంత్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, దాన్ని అనిల్ రావిపూడి చూసి ఈ అవకాశం ఇవ్వడం జరిగిపోయింది.

 

సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ లో దాదాపు 20 శాతం బుల్లిరాజుకే దక్కుతుంది అని చెప్పాలి. తండ్రిని మాట అంటే పడని కొడుకుగా.. ఓటీటీ చూసి బూతులు మాట్లాడే బాలుడుగా అతని నటన కానీ, డైలాగ్ డెలివరీ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు బుల్లిరాజు.

 

ప్రస్తుతం రేవంత్ అనే పేరు కన్నా బుల్లిరాజు అంటేనే అతనిని గుర్తిస్తున్నారు. ఈ సినిమా తరువాత రేవంత్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. వరుస సినిమాలతో స్టార్ హీరోల కన్నా ఎక్కువ బిజీగా ఉన్నాడు. అవకాశాల విషయంలోనే కాదు రెమ్యూనరేషన్ లో కూడా బుల్లిరాజు డిమాండ్ మాములుగా లేదట. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తరువాత ఏ కథ విన్నా కూడా డేట్స్ ఇవ్వాలంటే.. రోజుకు రూ. లక్ష రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడట.

 

నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు అంతగా లేరు.  జనరేషన్ బట్టి.. మగపిల్లలు త్వర త్వరగా ఎదిగిపోయి హీరోలుగా మారిపోతున్నారు. అంతెందుకు కోర్ట్ సినిమాలో హీరోగా నటించిన హార్ష్ రోషన్.. బాలనటుడిగా పరిచయం అయినవాడే. ఇలా చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు.

 

ఇక వీరికన్నా చిన్న వయస్సులో ఉన్నవారు కనిపించేది అంతంతమాత్రంగానే కావడంతో ఉన్నవారితోనే అడ్జస్ట్ కావడం ఒకటి.. ఆల్రెడీ హిట్ అందుకున్న బాలనటుడు కావడంతో తమ సినిమాకు హెల్ప్ అవుతాడు అని మరొక కారణంతో రేవంత్ ఎంత డిమాండ్ చేసిన ఇవ్వడానికి సిద్దమైన నిర్మాతలు కూడా ఉన్నారట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.