Nothing Phone 3 Launch: కాక నువ్వు కేక.. హై- పర్ఫామెన్స్ ఫీచర్లు.. నథింగ్ ఫోన్ 3 వచ్చేస్తోంది!

Nothing Phone 3 Launch: నథింగ్ ఫోన్ 3 జూలై 1న భారతదేశంలో లాంచ్ కానుంది. ఫోన్ లాంచ్ కు ముందు, దాని కీలక చిప్‌సెట్ వివరాలు, డిజైన్ గురించి సమాచారం లీక్ అయింది. నథింగ్ CEO కార్ల్ పీ ఫోన్ ఫీచర్లను వెల్లడించారు, ఇది ఫ్లాగ్‌షిప్ విభాగంలో మార్కెట్ దృష్టిని ఆకర్షించగలదని భావిస్తున్నారు. ఫోన్ 3 స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 SoC ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. మునుపటి నథింగ్ ఫోన్ 2లో ఉపయోగించిన స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌సెట్ కంటే ఇది గణనీయమైన అప్‌గ్రేడ్. కొత్త చిప్‌సెట్ CPU పనితీరును 36 శాతం మెరుగుపరుస్తుంది. ఇది రోజువారీ పనులు, భారీ గేమింగ్ కోసం అద్భుతమైన పనితీరును అందిస్తుందని భావిస్తున్నారు.
సీపీయు మాత్రమే కాదు, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ పనితీరులో 88 శాతం పెరుగుదల, న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ పనితీరులో 60 శాతం పెరుగుదలను నిర్ధారించారు. ఈ మెరుగుదలలు ఫోన్ మొత్తం ప్రతిస్పందనను పెంచుతాయని, “స్నాపియర్” అనుభవాన్ని అందిస్తాయని వెల్లడించారు. దీని అర్థం వినియోగదారులు యాప్‌ల మధ్య వేగంగా మారడం, మెరుగైన గేమింగ్ అనుభవం, కృత్రిమ మేధస్సు మరింత సున్నితంగా నడుస్తుందని ఆశించవచ్చు.
లీక్‌ల ప్రకారం.. నథింగ్ ఫోన్ 3 రెండు ప్రధాన వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 12GB RAM + 256GB స్టోరేజ్, 16GB RAM + 512GB స్టోరేజ్. వీటి ధర వరుసగా $799 అంటే సుమారు రూ. 68,000. మరో వేరియంట్ $899 అంటే సుమారు రూ. 77,000 గా ఉంటుందని అంచనా. దేశంలో ఈ హ్యాండ్‌సెట్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వస్తుంది. వినియోగదారులకు ఈ ఫోన్ ధరపై స్వల్ప తగ్గింపు లభించే అవకాశం ఉంది.
నథింగ్ ఫోన్ 3లో 6.77-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుందని భావిస్తున్నారు, ఇది బెటర్ కలర్, కాంట్రాస్ట్‌తో మెరుగైన వ్యూ అనుభవాన్ని అందిస్తుంది. కెమెరా సెటప్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. ఇది స్థిరమైన, స్పష్టమైన ఫోటోలను క్యాప్చర్ చేయడంలో సహాయపడుతుంది. లీక్స్ ప్రకారం.. ఇందులో అల్ట్రావైడ్ లెన్స్, కొత్తగా జోడించిన పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుంది. ఇది ఫోటోగ్రాఫిక్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది.
ఈ ఫోన్‌లో 5,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒకరోజు సులభంగా ఉపయోగించవచ్చు. డిజైన్ విషయానికి వస్తే, తాజాగా లీక్ అయిన రెండర్‌లు ట్రాన్స్‌పాంట్ బ్యాక్ ప్యానెల్ ఉంటుందని సూచిస్తున్నాయి. ఇది నథింగ్ ప్రత్యేకమైన డిజైన్ స్టైల్‌కి అనుగుణంగా ఉంటుంది. అయితే, నథింగ్ ఫోన్ 3 దాని సిగ్నేచర్ ఫీచర్ అయిన గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుందో లేదో కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. ఈ ఫోన్ నథింగ్ హెడ్‌ఫోన్ 1 ఓవర్-ఇయర్ ఆడియో వేరబుల్ ఫోన్‌తో పాటు యూ.ఎస్, కెనడాలో కూడా విడుదల అవుతుందని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- Blackberry is Back: బ్లాక్‌బెర్రీ ఈజ్ బ్యాక్.. కొత్త ఫోన్‌తో క్లాస్‌గా వచ్చేస్తోంది.. మార్కెట్లో మంటలే