Published On:

Scheme for Pregnant Women: మహిళలకు అదిరిపోయే స్కీం.. నేరుగా అకౌంట్లోకి రూ. 5వేలు.. పీఎంఎంవీవైకు దరఖాస్తు చేసుకోండిలా..!

Scheme for Pregnant Women: మహిళలకు అదిరిపోయే స్కీం.. నేరుగా అకౌంట్లోకి రూ. 5వేలు.. పీఎంఎంవీవైకు దరఖాస్తు చేసుకోండిలా..!

Pradhan Mantri Matru Vandana Yojana Scheme for Pregnant Women: కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అదిరిపోయే స్కీం తీసుకొచ్చింది. ప్రసూతి మహిళల కోసం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పథకాన్ని కేంద్రం 2017లోనే ప్రారంభించింది. అయితే ఈ పథకం.. 9 నెలల పాటు గర్భిణుల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు బిడ్డ సంక్షేమం ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో భాగంగానే ప్రసూతి మహిళలకు మొత్తం మూడు విడతల్లో రూ.5వేలను జమ చేస్తుంది.

 

కాగా, 2017లో ప్రారంభమైన ఈ పథకానికి ఇప్పటివరకు కొంతమంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే చాలా మందికి ఈ పథకం అమలు గురించి సరిగ్గా తెలియడం లేదు. ఈ విధంగా అవగాహన లేకపోవడంతో పథకానికి దూరమవుతున్నారు. ఈ పథకానికి 19 ఏళ్ల వయసు దాటిన మహిళలకు వివాహమై ఉండాలి. అర్హత ఉన్న మహిళలు వెబ్ సైట్ ‌ https://pmmvy.wcd.gov.in/ లో సిటిజన్ లాగిన్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

 

ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న తర్వాత లబ్ధిదారులు అకౌంట్లో నిధులు జమకానున్నాయి. ఈ డబ్బులు విడతల వారీగా జమవుతాయి. మొత్తం 3 విడతల్లో గర్భిణులకు నిధులు జమ చేస్తారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే తొలి విడత కింద లబ్ధిదారుల అకౌంట్లో రూ.1000 జమ కానుండగా.. రెండో విడతలో రూ.2వేలు, మూడో విడతలో శిశువు జన్మించిన తర్వాత మరో రూ.2వేలు జమ కానున్నాయి.