Published On:

Aamir Khan: అమితాబ్‌ వాయిస్‌ ఓవర్‌.. ‘లగాన్‌’ కచ్చితంగా ఫ్లాప్‌ అననుకున్నా: ఆమిర్‌ ఖాన్‌

Aamir Khan: అమితాబ్‌ వాయిస్‌ ఓవర్‌.. ‘లగాన్‌’ కచ్చితంగా ఫ్లాప్‌ అననుకున్నా: ఆమిర్‌ ఖాన్‌

Aamir Khan Comment on Laagan Movie: బాలీవుడ్‌ మిస్టర్‌ పర్పెక్ట్‌ నిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ త్వరలోనే 60వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. మార్చి 14న ఆయన 60వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పీవీఆర్‌ ఐనాక్స్‌ ఆమిర్‌ పుట్టిన రోజు వేడుకులను ఘనంగా జరపాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆయన నటించిన చిత్రాలను మళ్లీ థియేటర్లలో ప్రదర్శించనున్నట్టు ఇటీవల పీవీఆర్‌ ఐనాక్స్‌ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఆమిర్‌ ఖాన్‌ ఈ మధ్య తరచూ ఇంటర్య్వూలో పాల్గొంటున్నారు.

మిస్టర్ పర్ఫెక్ట్ నిస్ట్ ఆమిర్..

ఈ నేపథ్యంలో తాజాగా ఓ టాక్‌ షోలో పాల్గొన్న ఆయన తన సినీ కెరీర్‌ గురించి ప్రస్తావించారు. ఆమిర్‌ తన కెరీర్‌లో ఎన్నో గొప్ప సినిమాలు బాలీవుడ్‌కి అందించారు. ఇండియా సినిమా బాక్సాఫీసు హైయ్యేస్ట్‌ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా దంగల్‌ మొదటి స్థానంలో ఉంది. ఎన్నో సినిమాలు వచ్చిన ఆ రికార్డును ఎవరూ బ్రేక్‌ చేయలేకపోతున్నారు. ఎప్పూడు విభిన్న కథలు, పాత్రలతో ప్రయోగాలు చేస్తూ ఆడియన్స్‌ అలరిస్తుంటారు. బాలీవుడ్‌ ఇండస్ట్రీలో తన సినిమాలకు, పాత్రలకు ప్రత్యేకత ఉండేలా ప్రయోగాలు చేసి మిస్టర్‌ పర్ఫెక్ట్‌నిస్ట్‌గా పేరు గడించారు.

లగాన్ ఫ్లాప్ అనుకున్నా

ఇక ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘లగాన్‌’ ఒకటి. ఆమిర్‌ ఖాన్‌ స్వీయ నిర్మాణంలో ఆశుతోష్‌ గోవరికర్‌ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. రిలీజ్‌ తర్వాత లగాన్‌ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ మూవీ వచ్చి దశాబ్ధాలు గడిచిన ఇప్పటికే ఈ చిత్రం ఎవర్‌గ్రీన్‌ అనే చెప్పాలి. బాక్సాఫీసు వద్ద రికార్డు వసూళ్లు రాబట్డడమే కాదు, ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఉత్తమ పరభాష చిత్రంగా ఆస్కార్‌ అవార్డు నామినేషన్‌లోనూ నిలిచింది ఈ చిత్రం. అలాంటి ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఆమిర్‌ను చాలా టెన్షన్‌ పెట్టిందట. అంతేకాదు ఈ సినిమా ప్లాప్‌ అవుతుందని, ఇది ఎందుకు నిర్మిస్తున్నావంటూ ఆమిర్‌ ఎంతో మంది హెచ్చరించారట. దీంతో లగాన్‌ ఖచ్చితంగా ఫ్లాప్‌ అవుతుందని ఫిక్స్‌ అయ్యాడట ఆమిర్‌. ఇదే విషయాన్ని ఇంటర్య్వూలో చెబుతూ ఇలా అన్నారు.

అమితాబ్ వాయిస్ ఇస్తే అంతే..

“లగాన్‌ మూవీ రిలీజ్‌ టైంలో ఎంతో భయపడ్డాను. ఓ రోజు జావేద్‌ సాహెబ్‌ నాకు ఫోన్‌ చేసి పిలిచారు. నేను లగాన్‌ మూవీ నిర్మిస్తున్నానని తెలిసి నాతో ఆయన మాట్లాడాలనుకున్నారు. ఓ రోజు నేను ఆయనను కలిశాను. ‘నువ్వు ఎందుకిలా చేస్తున్నావ్‌? నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఏ ధైర్యంతో ఈ సినిమా(లగాన్‌) నిర్మిస్తున్నావ్‌? అని ప్రశ్నించారు. నీకు తెలియదా క్రికెట్‌పై వచ్చిన ఈ ఏ సినిమాలు ఈ మధ్య ఆడలేదు. అవన్ని ప్లాప్‌ అయ్యాయి. ఇది వర్కౌట్‌ అవ్వదు. నీ సినిమా ఖచ్చితంగా ప్లాప్‌ అవుతుంది. పైగా ఆమితాబ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ఆయన వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన సినిమాలు ప్లాప్‌ అవుతున్నాయనే సెంటిమెంట్‌ కూడా ఉంది. ఇక ఈ సినిమా ఆశలు వదులుకో’ అన్నారు. దీంతో నాకు భయం మొదలైంది. అప్పటికే అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌ కూడా ఇచ్చారు. ఇక లగాన్‌ మూవీ ప్లాప్‌ అవుతుందని ఫిక్స్‌ అయ్యా. కానీ విడుదలయ్యాక హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో చాలా సర్‌ప్రైజ్‌ అయ్యాను” అని చెప్పుకొచ్చాడు.