Nani: కోర్ట్ సినిమా నచ్చకపోతే.. నా ‘హిట్ 3’ చూడకండి: నాని ఆసక్తికర కామెంట్స్

Nani Comments at Court Event: నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడి’. హీనరో ప్రొడక్షన్‌లో హౌజ్‌లో ఈ సినిమా రూపొందింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. మార్చి 14న హోలీ పండగ సందర్భంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న(మార్చి 7) ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్‌లో పాల్గొన్న నాని స్టేజ్‌పై మాట్లాడుతూ ఆసకర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేసి అనంతరం నాని మాట్లాడాడు.
“నేను ఇండస్ట్రీకి వచ్చిన 16 ఏళ్లు దాటింది. దయ చేసి ఈ సినిమా చూడండి అని నేనేప్పుడు అడగలేదు. అయితే ఫస్ట్‌టైం అది ఇప్పుడు అడగబోతున్నాను. ఈ సినిమా నిర్మాతగా చెప్పడం లేదు. నా తెలుగు ప్రేక్షకులు ఓ మంచి మిస్ అవ్వోద్దని కోరుకుంటున్నా. అందుకే ప్రతి ఒక్కరు కోర్ట్ సినిమాని చూడండి. ఫ్యామిలీతో కలిసి వెళ్లి మారి చూడండి. తప్పకుండ మీరు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. కోర్ట్ చిత్రం చూసిన వారంతా గర్వంగా థియేటర్ల నుంచి బయటకు వస్తారు.
ఒకవేళ ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోతే నా నెక్ట్స్ మూవీ ‘హిట్3’ ఎవరూ చూడోద్దు. కోర్ట్ కంటే హిట్ 3కి పది రెట్లు ఖర్చు పెట్టాను. ఇక ఇంతకంటే బలంగా చెప్పలేను. ఈ సినిమా పాత్రలతో పాటు ప్రతిదీ కనెక్ట్ అవుతారు.రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, శుభలేక సుధాకర్, రోహిణి, హర్షవర్దన్ తదితరులు కీలక పాత్రలో నటించారు. నాని ప్రొడక్షన్ హౌజ్ వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు.