Published On:

Sitaare Zameen Par: అమీర్‌ఖాన్ కొత్త చిత్రాన్ని వీక్షించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!

Sitaare Zameen Par: అమీర్‌ఖాన్ కొత్త చిత్రాన్ని వీక్షించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!

President Draupadi Murmu watched Aamir Khan’s Sitaare Zameen Par: అమీర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘మూవీ సితారే జమీన్‌ పర్‌’. తాజాగా మూవీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించారు. రాష్ట్రపతి భవన్‌లో చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. రాష్ట్రపతితోపాటు ఆమె కుటుంబ సభ్యులు, సిబ్బంది, చిత్రబృందం పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్‌ సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది. రాష్ట్రపతి తమ మూవీని వీక్షించారని సంతోషం వ్యక్తం చేశారు. మూవీపై ఆమె చూసిన ఆదరణ తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఆమె ప్రశంసలు తమకు విలువైనవి అన్నారు. తమలో సంతోషాన్ని నింపాయని పేర్కొన్నారు. తమ టీమ్‌ అందరి తరఫున ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్షణాలను తాము ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామని టీమ్‌ పేర్కొంది.

 

తారే జమీన్‌ పర్‌ మూవీకి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రమిది. చదువులో వెనకబడుతున్న చిన్నారులు మానసికంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారన్న సమస్యను చూపిస్తే, ఇందులో మానసిక దివ్యాంగులు తమకున్న సమస్యను అధిగమించి ఎలాంటి విజయాన్ని అందుకున్నారన్నది చూపించారు. ఈ మూవీలో జెనీలియా కీలక పాత్ర పోషించారు. అమీర్‌ఖాన్ కోచ్‌గా కనిపించి సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. ఈ నెల 20న ఈ మూవీ విడుదలైంది.

 

ఇవి కూడా చదవండి: