Rajinikanth: కూలీ మూవీ నుంచి చికిటు సాంగ్ వచ్చేసిందోచ్

Chikitu Song Release From Coolie Movie: సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కూలీ. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీలో అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ వంటి స్టార్ యాక్టర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించి మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
అందులో భాగంగా.. ఫస్ట్ సాంగ్ ‘చికిటు’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటలో రజనీకాంత్ సహా అనిరుధ్, టి. రాజేందర్ కూడా డ్యాన్స్ తో అలరించారు. ప్రస్తుతం ఈ సాంగ్ రిలీజైన కొద్ది గంటల్లోనే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.