Aamir Khan : ప్రియురాలితో ఈవెంట్‌కు స్టార్‌హీరో అమీర్‌ఖాన్.. స్నేహితుడిపై సల్మాన్ ఖాన్ జోకులు

Bollywood star Hero Aamir Khan : బాలీవుడ్ స్టార్‌హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘సితారే జమీన్ పర్’. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఆర్‌ఎస్.ప్రసన్న రూపొందించారు. అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. సినీ తారల కోసం గురువారం సాయంత్రం ఈ మూవీ ప్రీమియర్ షో ముంబయిలో ప్రదర్శించారు. ప్రీమియర్ షోకు బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలనాటి నటి రేఖ, నటుడు విక్కీ కౌశల్‌తో సహా పలువురు పాల్గొన్నారు. సినిమా వీక్షించిన తర్వాత చిత్ర బృందంతో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో అమీర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో కలిసి సందడి చేశారు. ఆమెతో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్‌ఖాన్ తన స్నేహితుడు అమీర్‌పై జోకులు వేశారు. ఈ మూవీ తానే చేయాల్సిందని మధ్యలో అమీర్ వచ్చి చేరారంటూ సరదాగా చెప్పారు. ఈ మూవీ తెరకెక్కించడానికి ముందు ఏం జరిగిందో మీకు తెలియదని పేర్కొన్నారు. ఈ రోజు తాను మీతో కథ గురించి చెప్పారు. ఒకసారి అమీర్ తనను ఇంటికి ఆహ్వానించి కథ గురించి వివరించారని తెలిపారు. కథ తనకెంతో నచ్చిందని చెప్పుకొచ్చారు. తప్పకుండా చేస్తానని మాట ఇచ్చినట్లు చెప్పారు. కొన్నిరోజుల తర్వాత అతడి నుంచి ఫోన్ వచ్చిందని తెలిపారు. తానే ఈ మూవీ చేస్తున్నానని చెప్పారన్నారు. అందుకు తను సంతోషించినట్లు తెలిపారు. తన నిర్ణయాన్ని మెచ్చుకున్నానని కొనియాడారు. అనంతరం అమీర్ ఖాన్-కిరణ్‌రావు విడాకుల మీద సల్మాన్ సరదాగా వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే అమీర్ కథ తనకెప్పుడో చెప్పారని తెలిపారు. ఆయన అప్పుడే ఈ మూవీపై వర్క్ చేయాల్సింది కాకపోతే అదే సమయంలో వేరే పేపర్ వర్క్‌లో బిజీగా ఉన్నారన్నారు. సల్మాన్ మాటలతో అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లు నవ్వులు పూయించారు.
ఈ ఏడాది తన 60వ జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గౌరీ స్ప్రాట్‌తో రిలేషన్ గురించి అమీర్ బయటపెట్టారు. ఏడాదిన్నర నుంచి ఆమెతో డేటింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఆమెను మీడియాకు కూడా పరిచయం చేశారు. గౌరీ కొంతకాలంగా అమీర్‌ఖాన్ నిర్మాణ సంస్థలో సహాయకురాలిగా పనిచేస్తున్నారు. వీరి మధ్య 25 ఏళ్ల స్నేహబంధం ఉంది.