Published On:

Allu Arjun-Samantha: మరోసారి అల్లు అర్జున్‌తో జతకట్టబోతోన్న సమంత! – ఏ సినిమాలో తెలుసా?

Allu Arjun-Samantha: మరోసారి అల్లు అర్జున్‌తో జతకట్టబోతోన్న సమంత! – ఏ సినిమాలో తెలుసా?

Samantha Again Pair Up With Allu Arjun: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-హీరోయిన్ సమంతది హిట్‌ పెయిర్‌ అనడంలో సందేహం లేదు. వీరిద్దరు జంటగా నటించిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ మూవీ సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. వీరిద్దరు మధ్య వచ్చిన లవ్‌, కామెడీ, ఎమోషనల్‌ సీన్స్‌ బాగా పండాయి. ముఖ్యంగా సమంత, బన్నీ ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ ఓ మ్యాజిక్‌గా అనిపించింది. ఇక స్పెషల్‌ సాంగ్‌లోనూ వీరిద్దరి కాంబో అదిరిపోయింది.

 

బ్లాక్‌బస్టర్‌ పెయిర్‌

‘పుష్ప 1: ది రైజ్‌’ సినిమాలో ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా పాటకు వీరిద్దరు కలిసి డ్యాన్స్‌ చేశారు.  ఈ పాటలో వచ్చిన కొన్ని హుక్‌ స్టేప్స్‌ వావ్‌ అనిపించాయి. పాటలోనూ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ సాంగ్‌ ఎంతటి సెన్సేషన్‌ అయ్యిందో తెలిసిందే. దీంతో బన్నీ-సామ్ కాంబో అంటేనే బ్లాక్‌బస్టర్‌ అంటున్నారు ఫ్యాన్స్‌. అయితే ఇప్పుడు మరోసారి వీరిద్దరి జంటగా కలిసి నటించబోతున్నారట. బన్నీ అప్‌కమ్మింగ్‌ మూవీలో సామ్‌ హీరోయిన్‌గా నటించనుందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరగుతుంది. ఇంతకి ఆ సినిమా ఏంటీ? ఆ బిగ్‌ ప్రాజెక్ట్‌ ఏంటో చూద్దాం.

 

అట్లీ-అర్జున్ మూవీలో..

అల్లు అర్జున్‌ పుష్ప 2తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఒక్క సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ తన సత్తా చూపించాడు. ఇండియన్‌ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన రెండ భారతీయ సినిమాగా ‘పుష్ప 2’ రికార్డుకు ఎక్కింది. దీంతో బన్నీ నెక్ట్స్‌ చిత్రాలపై ఫుల్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. అయితే తమిళ్‌ హిట్‌ డైరెక్టర్‌ అట్లీతో అల్లు అర్జున్‌ 22 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్‌డే సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో పాన్‌ వరల్డ్‌ ఈ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ రూ. 600 కోట్ల బడ్జెట్‌లో ఈ సినిమా ప్లాన్‌ చేస్తోంది.

 

AA22లో సమంత?

ఇక దీనిపై అధికారిక ప్రకటన రావడంతో అభిమానులంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తయ్యింది. ప్రీ పొడక్షన్‌ వర్క్‌తో బిజీగా ఈ చిత్రాన్ని త్వరలోనే గ్రాండ్‌గా లాంచ్‌ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ కోసం వేతుకుతుంది మూవీ టీం. ఫీమేల్‌ లీడ్‌గా సమంత పేరును పరిశీలిస్తున్నారట. ఇప్పటికే అల్లు అర్జున్‌తో నటించింది సమంత. అలాగే అట్లీతో కూడా ఆమె మంచి ఫ్రెండ్‌ షిప్‌ ఉంది. ఇక వీరిద్దరి మంచి హిట్‌ జోడి కాబట్టి ఇందులో సమంతను తీసుకుంటే ప్లస్‌ అవుతుందని మూవీ టీం భావిస్తోందట. మరి ఈ వార్తల్లో నిజమేంత అనేది తెలియదు. కానీ, ఇదే నిజమైతే మాత్రం వెండితెరపై ఈ జోడీ ఏదోక మ్యాజిక్‌ జరగడం పక్కా అంటున్నారు. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేయిట్‌ చేయాల్సిందే.