Chhaava OTT Release: ‘ఛావా’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది – స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!

Chhaava OTT Release Date Fix: లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఛావా’ ఓటీటీ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. బాలీవుడ్ టాలెంటడ్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్‌లో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఛత్రపతి శివాజి తనయుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఫస్ట్ డే ఫస్ట్ షోకు ఛావా హిట్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది.
‘ఛావా’ ఓటీటీ రిలీజ్ ప్రకటన
మొదట హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమాను ఆ తర్వాత తెలుగులోను విడుదల చేశారు. మార్చి 7న గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో విడుదల చేసింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా ఛావా రూ. 750 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ. 590 కోట్లు నెట్ కలెక్షన్స్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై సెడన్ ప్రకటన వచ్చింది. ఇది చూసి మూవీ లవర్స్ అంత సర్‌ప్రైజ్ అవుతున్నారు. సుమారు రెండు నెలల తర్వాత ఛావా ఓటీటీలోకి వస్తుండటంతో సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఒప్పందం ప్రకారం ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నట్టు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది. అయితే ఈ చిత్రాన్ని హిందీ, తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తారా? లేక ఇతర భాషల్లోనూ విడుదల చేస్తారా? అనేది క్లారిటీ లేదు. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు.
Aale Raje aale
Witness a tale of courage and glory etched in time
Watch Chhaava, out 11 April on Netflix. #ChhaavaOnNetflix pic.twitter.com/6BJIomdfzd
— Netflix India (@NetflixIndia) April 10, 2025
ఇవి కూడా చదవండి:
- Rajinikanth About Jayalalitha : జయలలిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు – అందుకే ఆమెను వ్యతిరేకించా: రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు