Last Updated:

Naraka Chaturdashi: నరక చతుర్ధశి రోజు చెయ్యకూడని పనులివే..!

ప్రతి సంవత్సరం కార్తీక కృష్ణ పక్షం చతుర్దశినాడు జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది దీపావళి మరియు నరక చతుర్దశి పండుగలు రెండూ ఒకే రోజు వచ్చాయి. మరి ఈ రోజు కొన్ని చేయకూడని పనులు కూడా చేస్తూ అనేక సమస్యలను తెచ్చుకుంటున్నారు. మరి అలా చెయ్యకూడని పనులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Naraka Chaturdashi: నరక చతుర్ధశి రోజు చెయ్యకూడని పనులివే..!

Naraka Chaturdashi: ప్రతి సంవత్సరం కార్తీక కృష్ణ పక్షం చతుర్దశినాడు జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది దీపావళి మరియు నరక చతుర్దశి పండుగలు రెండూ ఒకే రోజు వచ్చాయి. కాబట్టి నరక చతుర్దశిని అక్టోబర్ 23న జరుపుకోవాలని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజున దక్షిణం దిక్కున పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించి యమధర్మరాజును పూజించాలని పురాణాలు చెప్తున్నాయి. చాలా మంది ఇలా చెయ్యడాన్ని ఆనవాయితీగా భావిస్తుంటారు. అయితే చాలామంది ఈ పూజలో భాగంగా చేస్తున్న చిన్నచిన్న తప్పుల వల్ల యమధర్మరాజును ప్రశన్నం చేసుకోలేకపోతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని చేయకూడని పనులు కూడా చేస్తూ అనేక సమస్యలను తెచ్చుకుంటున్నారు. మరి అలా చెయ్యకూడని పనులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పనులు చేయకూడదు

  • నరక చతుర్దశి రోజున రాత్రి వేళ త్వరగా పడుకొని ఉదయం పూట అంటే దీపావళి రోజున తెల్లవారుజామున ఐదు గంటలకే లేవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
  • నరక చతుర్ధశి నాడు ఇంటి తలుపులు అస్సలు తెరవకూడదు. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారాలను మూసి ఉంచాలి.
  • పొరపాటున కూడా మాంసాహారం తీసుకోకూడదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
  • ఈ రోజు చీపురును ఇంటి నుంచి బయటకు తీయకూడదు.
  • నరక చతుర్దశి రోజున ఇంట్లో గొడవలు పడడం వల్ల పేదరికంలోకి వెళ్తారని అంటారు.
  • ఈ రోజు ఇంట్లో దక్షిణ దిశలో ఉన్న దుమ్ము, ధూళిని తొలగించాలి.
  • ఈ రోజున కూడా నూనె దానం చేయకూడదు. వీటంన్నింటిని పాటించడం వల్ల మీకు లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని యమధర్మరాజు ప్రశన్నమయ్యి దీర్ఘాయుష్సును కలుగజేస్తారని కొందరి విశ్వాసం

ఇదీ చదవండి: దీపావళికి ఈ 4 లక్ష్మీ ఆలయాలను సందర్శిస్తే సిరిసంపదలు మీ సొంతం

ఇవి కూడా చదవండి: