Last Updated:

Tirumala: ఉద్యోగాల పేరుతో కోటిన్నర స్వాహా

తిరుమల తిరుపతి దేవస్ధానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటనలో కోటిన్నర రూపాయలను స్వాహా చేసిన్నట్లు పోలీసులు తేల్చారు

Tirumala: ఉద్యోగాల పేరుతో కోటిన్నర స్వాహా

Tirupati: తిరుమల తిరుపతి దేవస్ధానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటనలో కోటిన్నర రూపాయలను స్వాహా చేసినట్లు పోలీసులు తేల్చారు. పిచ్చాటూరుకు చెందిన బాలకృష్ణ నిరుద్యోగులు 17మంది నుండి నగదు వసూలు చేసిన్నట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతి నగర పాలక సంస్ధకు చెందిన ఉద్యోగులు శానిటరీ ఇన్స్ పెక్టర్ వెంకటరత్నం, కమీషనర్ కారు డ్రైవర్ హేమంత్ తో పాటు శివ అనే ముగ్గురు వ్యక్తులతో కలిసి బాలకృష్ణ ఈ ఘటనకు బాధ్యులుగా పోలీసులు గుర్తించారు. అందరినీ అదుపులోకి తీసుకొన్న పోలీసులు ప్రాధిమికంగా తేల్చిన కోటిన్నర రూపాయలతో పాటు ఇంకేమైనా మోసాలకు పాల్పొడ్డారా అన్న కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.

అధికార పార్టీ, స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకొంటున్న వ్యక్తులకు అధికార పార్టీ నేతలు అండగా ఉండడాన్ని ప్రజలు అసహ్యించుకొంటున్నారు.

ఇవి కూడా చదవండి: