Last Updated:

Twitter: ట్విటర్‌లో “బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్” నిలిపివేత.. అఫీసియల్ వచ్చింది

ఎలన్‌ మస్క్ ట్విటర్‌లోని అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్‌’ను ప్రీమియం సర్వీసుగా తీసుకొచ్చిన సంగితి తెలిసిందే. దీనికోసం ఈ బ్లూ టిక్‌కు నెలవారీ ఛార్జీలు ప్రకటించారు. అయితే తాజాగా ఇలా చెయ్యండం వల్ల నకిలీ ఖాతాలు పెరిగిపోయాయని ఈ సర్వీసును నిలిపివేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్విటర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ కన్పించట్లేదని యూజర్లు అంటున్నారు.

Twitter: ట్విటర్‌లో “బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్” నిలిపివేత.. అఫీసియల్ వచ్చింది

Twitter: ఎలన్‌ మస్క్ ట్విటర్‌లోని అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్‌’ను ప్రీమియం సర్వీసుగా తీసుకొచ్చిన సంగితి తెలిసిందే. దీనికోసం ఈ బ్లూ టిక్‌కు నెలవారీ ఛార్జీలు ప్రకటించారు. అయితే తాజాగా ఇలా చెయ్యండం వల్ల నకిలీ ఖాతాలు పెరిగిపోయాయని ఈ సర్వీసును నిలిపివేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్విటర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ కన్పించట్లేదని కొన్ని అంతర్జాతీయ మీడియాలు పేర్కొంటున్నాయి.

ఇంతకు ముందు ట్విటర్‌.. ప్రభుత్వ విభాగాలు, కార్పొరేట్‌ సంస్థలు, ప్రముఖులు, జర్నలిస్టలు ఇలా ప్రముఖుల ఖాతాలను వెరిఫై చేసి ఈ ‘బ్లూ టిక్‌’ను ఇచ్చేవారు. దానితో ఆయా ఖాతాలు వారివే అనేందుకు ఖచ్చితమైన ఆధారం ఉండేది. కాగా ఇటీవల ఎలన్ మస్క్ బ్లూటిక్ కోసం నెల వారీ ప్రీమియం ప్రకటించారు. దానికి గానూ 8 డాలర్లు చెల్లించినవారికి ఎలాంటి వెరిఫికేషన్‌ లేకుండానే ‘బ్లూ టిక్‌’ ఇచ్చారు. దీనితో చాలా మంది ప్రముఖ కంపెనీలు లేదా వ్యక్తుల పేర్లను ఉపయోగించి నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారని సమాచారం. ఇలా ఉండడం వల్ల ఆ సంస్థలు లేదా వ్యక్తుల ఏది అసలైన ఖాతా అని నిర్ధరించుకోవడంలో యూజర్లకు గందరగోళం నెలకొంది. దీనిపై ఆందోనలు వ్యక్తమవడంతో ఈ సర్వీసును ట్విటర్‌ నిలిపివేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్విటర్‌ యాప్‌లో బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ ఫీచర్‌ కన్పించట్లేదని పలువురు యూజర్లు తెలిపారు. అంటే ఇకపై కొత్తగా ఎవరి ఖాతాలకు ‘బ్లూ టిక్‌’ ఇవ్వరనమాట.కాగా ఈ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ నిన్నటి నుంచి భారత్‌లోనూ ఈ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. అలా రాగానే ఇలా ఆగిపోవడంపై యూజర్లు పలువురు స్పందించారు.

ఇదిలా ఉంటే మరోవైపు ట్విటర్‌ కొత్తగా వెరిఫైడ్‌ ఖాతాల కింద ఊదా రంగులో ‘అధికారిక’  (Official) అనే ట్యాగ్‌ను జత చేసింది. ఆ తర్వాత దీనిపై కూడా విమర్శలు వ్యక్తమవడంతో కొద్ది గంటల్లోనే దానిని కూడా వెనక్కి తీసుకుంది. మళ్లీ శుక్రవారం నుంచి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే అది కూడా పూర్తి స్థాయిలో కాకుండా అమెజాన్‌, నైక్‌, కోకా-కోలా, గూగుల్‌ వంటి కొన్ని దిగ్గజ సంస్థల ఖాతాలకు మాత్రమే ఈ ట్యాగ్‌ కనిపిస్తోంది. ఏదిఏమైనా ఇకపై ట్విటర్‌లో ‘బ్లూ టిక్‌’ అనేది కన్పించకపోవచ్చేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: ట్విట్టర్ దివాళా తీసే అవకాశం ఉంది.. ఎలోన్ మస్క్

ఇవి కూడా చదవండి: