Last Updated:

Public Sector Banks: 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.15,306 కోట్ల లాభాలు

2023 మొదటి త్రైమాసికంలో12 ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు రూ. 15,306 కోట్ల సంచిత లాభాన్ని ఆర్జించాయి,మునుపటి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ కాలంలో, ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు రూ.14,013 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి.దీనితో 9. 2 శాతం వృద్ది నమోదయింది.

Public Sector Banks: 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.15,306 కోట్ల లాభాలు

Public Sector Banks: 2023 మొదటి త్రైమాసికంలో12 ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు రూ. 15,306 కోట్ల సంచిత లాభాన్ని ఆర్జించాయి. మునుపటి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ కాలంలో, ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు రూ. 14,013 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి. దీనితో 9.2 శాతం వృద్ది నమోదయింది.

మొత్తం 12 బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభాల్లో 7-70% వరకు తగ్గిపోయాయి. వీటి లాభాల క్షీణతకు మార్క్-టు-మార్కెట్ నష్టాలు కారణమని చెప్పవచ్చు. కొనుగోలు ధర కంటే తక్కువ ధరతో మార్కెట్ ద్వారా ఆర్థిక ఆస్తుల విలువను నిర్ణయించినప్పుడు మార్కెట్ టు మార్కెట్ నష్టాలు సంభవిస్తాయి.

మొదటి త్రైమాసికంలో తొమ్మిది బ్యాంకులు 3-117% నుండి లాభాలను నమోదు చేసాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇది రూ. 208 కోట్లు కావడం గమనార్హం. దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా 79% వృద్ధిని నమోదు చేసింది. ఏడాది క్రితం రూ. 1,209 కోట్లుగా ఉన్న లాభాలు ప్రస్తుతం రూ.2,168 కోట్లకు చేరాయి.

ఇవి కూడా చదవండి: