Last Updated:

Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@18,700

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన ట్రేడింగ్‌.. రోజంతా ఉత్సాహంగా కదలాడాయి. ఏ దశలోనూ మార్కెట్లకు అమ్మకాల ఒత్తిడి తగల్లేదు.

Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@18,700

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన ట్రేడింగ్‌.. రోజంతా ఉత్సాహంగా కదలాడాయి. ఏ దశలోనూ మార్కెట్లకు అమ్మకాల ఒత్తిడి తగల్లేదు. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు అందుకు దోహదం చేశాయి. ద్రవ్యోల్బణం తగ్గడం, పారిశ్రామికోత్పత్తి ఊపు అందుకోవడం, ఇంటర్నేషనల్ మార్కెట్ లో చములు ధరలు తగ్గడం లాంటి సానుకూల అంశాలు మార్కెట్లు ర్యాలీకి దోహదం చేశాయి.

ఉదయం సెన్సెక్స్‌ 62,779.14 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 63,177.47 నుంచి 62,777.04 మధ్య కదలాడింది. చివరకు 418.45 పాయింట్ల లాభంతో 63,143.16 దగ్గర ముగిసింది. నిఫ్టీ 18,631.80 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,728.90 నుంచి 18,631.80 మధ్య ట్రేడ్ అయింది. చివరకు 114.65 పాయింట్లు లాభపడి 18,716.15 దగ్గర స్థిరపడింది. మార్కెట్లు ముగిసేటప్పటికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.43 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, ఐటీసీ, రిలయన్స్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభపడ్డాయి. నష్టపోయిన షేర్ల జాబితాలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, విప్రో షేర్లు నష్టపోయాయి.

 

ఇతర అంశాలు(Stock Market)

ఎంఆర్‌ఎఫ్‌ షేరు విలువ ఇంట్రాడేలో రూ. 1 లక్ష మార్క్‌ను దాటింది. ఈ మైలురాయిని చేరుకున్న తొలి కంపెనీగా ఎంఆర్‌ఎఫ్‌ రికార్డు సృష్టించింది. గత ఏడాది ఆర్థిక ఫలితాలు మదుపర్లను మెప్పించడంతో షేర్లు రాణిస్తున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి షేరు విలువ 0. 94 శాతం పుంజుకొని రూ. 99,900 దగ్గర స్థిరపడింది.

భవిష్యత్‌పై మెరుగైన వృద్ధి అంచనాల నేపథ్యంలో డీఎల్‌ఎఫ్‌ షేరు విలువ 2.79 శాతం పుంజుకొని రూ. 504.30 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ స్టాక్‌ రూ. 504.75 దగ్గర 52 వారాల గరిష్ఠాన్ని తాకింది.