Hardik Pandya: అక్కడ పొరపాటు చేశాం.. గుజరాత్ ఓటమిపై హార్దిక్ పాండ్యా ఏమన్నాడంటే?
Hardik Pandya: బౌలింగ్‌లో విషయంలో మేం కాస్త అదుపు తప్పాం. మా వద్ద అద్భుతమైన బౌలింగ్ విధానం ఉంది. అయిన కూడా కొన్ని అదనంగా పరుగులు సమర్పించుకున్నాం అని తెలిపాడు.
Hardik Pandya: తొలి క్వాలిఫయర్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. లక్ష్య ఛేదనలో ఆ జట్టు తడబడింది. ఇక ఓటమి అనంతరం హార్దీక్ మాట్లాడాడు. ఈ ఓటమికి గల కారణాలను పాండ్యా వివరించారు. బౌలింగ్ విషయంలో.. కొన్ని తప్పులు జరిగాయని పాండ్యా అన్నాడు.
పాండ్యా ఏమన్నాడంటే? (Hardik Pandya)
తొలి క్వాలిఫయర్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. లక్ష్య ఛేదనలో ఆ జట్టు తడబడింది. ఇక ఓటమి అనంతరం హార్దీక్ మాట్లాడాడు. ఈ ఓటమికి గల కారణాలను పాండ్యా వివరించారు. బౌలింగ్ విషయంలో.. కొన్ని తప్పులు జరిగాయని పాండ్యా అన్నాడు.
లీగ్ స్టేజ్ లో అదరగొట్టిన గుజరాత్.. క్వాలిఫయర్ మ్యాచ్ లో తేలిపోయింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో కీలక పోరుకు చేరిన గుజరాత్‌కు చెన్నై సూపర్ కింగ్స్ షాక్ ఇచ్చింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ ఓటమిపాలైంది. ఇందులో ఓడినా ఫైనల్‌కు చేరుకునేందుకు మరొక అవకాశం ఉంది.
బౌలింగ్‌లో విషయంలో మేం కాస్త అదుపు తప్పాం. మా వద్ద అద్భుతమైన బౌలింగ్ విధానం ఉంది. అయిన కూడా కొన్ని అదనంగా పరుగులు సమర్పించుకున్నాం అని తెలిపాడు. మా ప్రణాళికలను పక్కాగా అమలు చేసినప్పటికీ.. ఇలా జరిగిందని వివరించాడు. దీని గురించి బాధగా లేదని.. వచ్చే మ్యాచ్ పైనే దృష్టి సారిస్తామని అన్నాడు.
గుజరాత్ ఓటమి..
చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్ -1 మ్యాచ్‌లో చెన్నై, గుజరాత్ టీమ్ లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ జట్టుని మట్టి కరిపించి చెన్నై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
దాంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 14 సీజన్ లలో 10 వ సారి ఫైనల్‌కి అర్హత సాధించింది.
మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై టీమ్ 172 పరుగులు చేయగా.. టార్గెట్ ని ఛేదించే క్రమంలో గుజరాత్ టీమ్ 157 పరుగులకి ఆలౌటైంది.
ఐపీఎల్లో గుజరాత్ టీమ్‌ని చెన్నై ఓడించడం ఇదే తొలిసారి కాగా.. గతంలో మూడుసార్లు గుజరాత్ చేతిలో ఓటమి పాలయ్యింది.
దాంతో హోమ్ గ్రౌండ్ వేదికగా చెపాక్‌లో ఆ జట్టు ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది.
ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓడినప్పటికీ ఫైనల్‌కి చేరేందుకు ఆ జట్టుకి క్వాలిఫయర్ -2 ( ఈ నెల 26) మ్యాచ్ ద్వారా ఛాన్స్ ఉంది చెప్పవచ్చు.
173 పరుగుల టార్గెట్ ని చేధించడానికి బరిలోకి దిగిన గుజరాత్.. ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సాహా (12) తక్కువ స్కోర్ కే వెనుదిరిగినా.. ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ శుభమన్ గిల్ (42: 38 బంతుల్లో 4×4, 1×6) నిలకడగా ఆడుతూ గుజరాత్ స్కోరు బోర్డుని ముందుకు నడిపించాడు. కానీ మిగితా బియాత్రలు అంతా వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో అతనికి సపోర్ట్ లభించలేదు. సాహ ఔట్ అయిన తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ లలో కెప్టెన్ హార్దిక్ పాండ్య (8), దసున్ శనక (17), డేవిడ్ మిల్లర్ (4) రాహుల్ తెవాటియా (3) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. ముఖ్యంగా పాండ్య, తివాటియా కీలక మ్యాచ్ లో తీవ్రంగా నిరాశ పరిచారు. విజయ్ శంకర్ (14) కాస్త పరవాలేదు అనిపించుకుంటున్న తరుణంలో ఔట్ అవ్వడం.. చివర్లో రషీద్ ఖాన్ (30: 16 బంతుల్లో 3×4, 2×6) మెరుపులు మెరిపించినా కానీ మ్యాచ్ కీలక దశలో ఉన్నప్పుడు వీరిద్దరూ ఔట్ అవ్వడం గుజరాత్ ఓటమిని ఖాయం చేసింది. మొత్తానికి 20 ఓవర్లలో గుజరాత్ 157 పరుగులకి గుజరాత్ ఆలౌటైంది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, థీక్షణ, జడేజా, పతిరన రెండేసి వికెట్లు, తుషార్ దేశ్‌పాండే ఒక వికెట్ తీశారు.