Last Updated:

Anant-Radhika Family Sangeet: అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ సంగీత్‌లో టీ20 హీరోలకు అభినందనలు

ముంబయిలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ యొక్క వివాహ వేడుకులు ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా జరిగిన సంగీత్ కార్యక్రంలో టీ 20 ప్రపంచ కప్ విజేతలను సాదరంగా అభినందించారు.

Anant-Radhika Family Sangeet: అనంత్ అంబానీ -రాధిక మర్చంట్  సంగీత్‌లో టీ20 హీరోలకు అభినందనలు

Anant-Radhika Family Sangeet: ముంబయిలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో అనంత్ అంబానీ , రాధిక మర్చంట్  వివాహ వేడుకులు ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా జరిగిన సంగీత్ కార్యక్రంలో టీ 20 ప్రపంచ కప్ విజేతలను సాదరంగా అభినందించారు.

నీతా అంబానీ భావోద్వేగం..(Anant-Radhika Family Sangeet)

ఈ సందర్బంగా నీతా అంబానీ మాట్లాడుతూ ఇక్కడ మనమందరం కుటుంబసభ్యులం. కానీ నాకు మరొక కుటుంబం ఉంది, ఇది దేశం గర్వించేలా చేసింది. ప్రతి ఒక్కరి హృదయాన్ని గర్వంగా ఉప్పొంగేలా చేసింది ఇది ఎంత గొప్ప అనుభూతనేది నేను మీకు చెప్పలేను. ఈ రాత్రి నా ముంబై ఇండియన్స్ కుటుంబాన్ని ఇక్కడ కలిగి ఉండటం వేడుక రోజు, ఈ రాత్రి అనంత్ మరియు రాధికతో పాటు, మేము భారతదేశంతో జరుపుకోబోతున్నామని నీతా పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆమె కెప్టెన్ రోహిత్‌ శర్మ, సూర్య కుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యను వేదికపైకి పిలిచారు. వారిని పిలిచేటపుడు వారు సాధించిన ఘనతలను కూడా చెప్పారు. వారిని హత్తుకుని నీతా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా హార్దిక్‌ పాండ్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కఠిన సమయాలు నిరంతరం ఉండవు. కానీ, వాటికి ఎదురు నిలిచినవారే ముందుకు సాగగలరు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వేడుకల్లో పలువురు క్రికెట్, బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: