Last Updated:

Hardik Pandya: హార్దిక్ పాండ్యా భార్య నటాసా స్టాంకోవిచ్‌కు తన ఆస్తిలో 70 శాతం ఇచ్చేయాలా?

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యకు 2024 ఐపీఎల్‌ సీజన్‌లో కాలం కలిసివచ్చినట్లు లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ లీగ్‌ పాయింట్స్‌ టేబుల్‌లో మొత్తం 14 మ్యాచ్‌లకు గాను కేవలం 4 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచాడు.

Hardik Pandya: హార్దిక్ పాండ్యా భార్య నటాసా స్టాంకోవిచ్‌కు  తన ఆస్తిలో 70 శాతం ఇచ్చేయాలా?

Hardik Pandya: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యకు 2024 ఐపీఎల్‌ సీజన్‌లో కాలం కలిసివచ్చినట్లు లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ లీగ్‌ పాయింట్స్‌ టేబుల్‌లో మొత్తం 14 మ్యాచ్‌లకు గాను కేవలం 4 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచాడు. దీంతో ముంబై ఇండియన్‌ మ్యాచ్‌ జరుగుతున్న స్టేడియంలో పాండ్యను ప్రేక్షకులు ఓ ఆట ఆడుకుంటున్నారు. దీంతో పాటు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ నుంచి పాండ్య కెప్టెన్సీనిలాక్కున్నాడని ఫ్యాన్స్‌ కాస్తా ఆగ్రహంతో ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆయన వ్యక్తిగత జీవితం కూడా సాఫీగా సాగడం లేదన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

పాండ్య ఇంటిపేరు తొలగింపు..(Hardik Pandya)

సోషల్‌ మీడియాలో ఇటీవల పాండ్య ఆయన భార్య నటాసా స్టాంకోవిక్ విడిపోతున్నారన్న పుకార్లు వెల్లువెత్తాయి. రేపోమాపో విడాకులు కూడా తీసుకుంటారన్న టాక్‌ వినిపిస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. పాండ్య సెర్బియన్‌ మోడల్‌ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రాం హ్యాండిల్‌ నుంచి పాండ్య ఇంటిపేరును తొలగించింది. నటాసా స్టాంకోవిక్‌ పాండ్యా నుంచి సింపుల్‌గా నటాసా స్టాంకోవిక్‌గా మార్చుకుంది.

ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ జంట తరచూ సోషల్‌ మీడియాలో తమ ఫోటోలను షేర్‌ చేసేవారు. అయితే మార్చి 4న తన భార్య పుట్టిన రోజు ఫోటోలను పాండ్యా పోస్ట్‌ చేయలేదు. దీంతో పాటు ఐపీఎల్‌ 2024 మ్యాచ్‌లకు ఆమె రావడం లేదు. దీంతో పుకార్లు మరింత ఊపందుకున్నాయి. తాజా పుకార్ల విషయానికి వస్తే ఒక వేళ పాండ్య విడాకులు తీసుకుంటే తన ఆస్తిలో 70 శాతం ఆమె ఇవ్వాల్సి వస్తుందని ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు. మరో యూజర్‌ మాత్రం పాండ్యకు సానుభూతి తెలిపారు. ప్రస్తుతం పాండ్యా కష్టాల్లో ఉన్నాడు. ఒక వైపు కుటుంబసమస్యలు, మరోపక్క ఫ్రాంచైజీ ఒత్తిడి, ఇవన్నీ పక్కనపెడితే ఆయనపై ట్రోల్స్‌..అయినా ఆయన చిరునవ్వుతో కనిస్తున్నారని పోస్ట్‌ పెట్టాడు. తన ఆస్తిని తల్లిపేరుపై రాశాడన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ప్యాండ్యా నటాషా రిలేషన్‌ షిప్‌ విషయానికి వస్తే పాండ్య అప్పటి తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్నాక.. జులై 30, 2020లో వారికి బాబు పుట్టాడు. మరి పాండ్యా విడాకుల గురించి వాస్తవాలు తెలియాలంటే ఆయన స్వయంగా చెబితేనే ఈ వార్తలను నమ్మవచ్చు.

ఇవి కూడా చదవండి: