MLA Balineni Srinivasa Reddy: నాపై నిందలు, ఆరోపణలను భరించలేకపోతున్నా.. కంటతడిపెట్టిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి
పార్టీ కోసం తాను చాలా శ్రమించానని ఎన్నో బాధలు పడ్డానని అయితే నిందలు, అవమానాలు భరించలేకపోతున్నానని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు
MLA Balineni Srinivasa Reddy: పార్టీ కోసం తాను చాలా శ్రమించానని ఎన్నో బాధలు పడ్డానని అయితే నిందలు, అవమానాలు భరించలేకపోతున్నానని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనపై ఎమ్మెల్యేలతో సీఎంకు ఫిర్యాదు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజీకాయాలనుంచి తప్పుకుంటానని కంట తడిపెట్టారు.
మంత్రి పదవిని ఖాతరు చేయలేదు..(MLA Balineni Srinivasa Reddy)
1999లో తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయభిక్ష పెట్టి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారని అన్నారు. తరువాత 2004, 2009లో కూడా తనకు టిక్కెట్టు ఇచ్చారని తాను గెలిచానని అన్నారు. తనకు వైఎస్ మంత్రి పదవి కూడా ఇచ్చారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో భాగంగా జిల్లాకు వచ్చినపుడు మంత్రి పదవి గురించి కూడా ఆలోచించకుండా పాల్గొన్నానని అన్నారు.2014లో తనకు జగన్ మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. జిల్లా అంతా తనకు ప్రతీ నియోజక వర్గంలో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. చెన్నై హవాలా, భూకబ్జాలు, సినిమాల్లో పెట్టుబడులు పెట్టానని అంటున్నారని అన్నారు.
గోనె ప్రకాశరావు అలా ఎందుకంటాడు ? ..
వైవి సుబ్బారెడ్డి వల్లే నేను ఎమ్మెల్యే అయ్యానని గోనె ప్రకాశరావు అన్నాడు. అతను సుబ్బారెడ్డిని ఇంద్రుడు చంద్రుడు అన్నాడు. మంచిదే. కాని నాగురించి మాట్లాడవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జగన్ జైలుకు వెడతాడని అంటాడు. భారతమ్మని ప్రశ్నిస్తారని అంటాడు. కాని సుబ్బారెడ్డిని పొగుడుతాడు. నేను మంత్రిగా ఉన్నా, లేకపోయినా ఎవరికీ అన్యాయం చేయలేదు. వాసు మా నియోజకవర్గంలో తలదూరుస్తున్నాడని సీఎంకు ఫిర్యాదులు చేయిస్తున్నారు. పార్టీ గురించి ఎంత శ్రమించానో, ఎంత పాటు పడ్డానో నాకు తెలుసు. టీడీపీ వారిని ఎవరిని కలిసినా నా గురించి చెబుతారు. నామీద, నాకుమారుడి మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
మొదటినుంచి వైఎస్సార్ కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉన్నాను. అటువంటి నన్ను పార్టీ మారుతున్నానంటూ ప్రచారం చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారో తెలియదు. నా మీద ఎందుకు బురద జల్లుతున్నారో తెలియదు. మీకు కూడా తెలుసు ఎవరు చేస్తున్నారో అంటూ మీడియాతో అన్నారు. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా. మొదటినుంచి ఉన్న కార్యకర్తలకోసం ఎటువంటి త్యాగమయినా చేస్తానని బాలిరెడ్డి అన్నారు.
https://youtu.be/DFt730l3oY8