RCB vs LSG: పూరన్ ఊచకోత.. చివరి బంతికి లక్నో థ్రిల్లింగ్ విక్టరీ
LSG: నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ విక్టరీ సాధించింది. అలవోకగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ లో బెంగళూరు ఓటమి పాలైంది. పూరన్, స్టోయినిస్ బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశారు.
LSG: నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ విక్టరీ సాధించింది. అలవోకగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ లో బెంగళూరు ఓటమి పాలైంది. పూరన్, స్టోయినిస్ బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశారు. ఈ మ్యాచ్ లో సిక్సర్ల వర్షంలో అభిమానులు తడిసి ముద్దయ్యారు. ఈ మ్యాచ్ లో చివరి బంతికి లక్నో విజయం సాధించింది.
పూరన్ ఊచకోత.. (LSG)
నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ విక్టరీ సాధించింది. అలవోకగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ లో బెంగళూరు ఓటమి పాలైంది. పూరన్, స్టోయినిస్ బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశారు. ఈ మ్యాచ్ లో సిక్సర్ల వర్షంలో అభిమానులు తడిసి ముద్దయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన బెంగళూరు భారీ స్కోర్ చేసింది. కోహ్లి చెలరేగిపోగా.. డుప్లెసిస్ రెచ్చిపోయాడు. మ్యాక్స్‌వెల్ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో బెంగళూరు ఏకంగా 212 పరుగులు చేసింది. కానీ బౌలర్ల విఫలంతో.. టార్గెట్ ని కాపాడుకోలేకపోయింది. మెుదట స్టాయినిస్.. ఆ తర్వాత పూరన్ ఊచకోత కోసేశారు.
లక్నో సూపర్ బ్యాటింగ్..
చివరి బంతికి నెగ్గి లక్నో సూపర్ విక్టరీని సాధించింది. పూరన్..19 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి.
ఇక స్టాయినిస్.. 30 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు చెలరేగడంతో.. లక్నో విజయం సాధించింది.
ఓ దశలో ఓటమి తప్పదనుకునే మ్యాచ్ లో జెయింట్స్ విజయం సాధించింది. మెుదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. డుప్లెసిస్ 79, కోహ్లి 61 పరుగులు చేశారు.
ఓ దశలో లక్నో 4 ఓవర్లకు 23/3తో చిక్కుల్లో పడింది. గెలుపు కష్టమే అనిపించిన దశలో మ్యాచ్ మలుపు తిరిగింది. స్టాయినిస్ పెను విధ్వంసంతో లక్నోని రేసులోకి తెచ్చాడు.
కానీ వెనువెంటనే.. స్టాయినిస్, రాహుల్ వరుస ఓవర్లలో ఔటయ్యారు. స్టాయినిస్ శ్రమను వృథా పోనివ్వని పూరన్ వవర్ హిట్టింగ్తో అంతకన్నా రెచ్చిపోయి ఆడాడు.
అప్పుడే అయిపోవాల్సింది..
చివరి ఓవర్లో 5 పరుగులు అవసరం కాగా.. రెండో బంతికి వుడ్ (1) బౌల్డయ్యాడు. తర్వాతి 2 బంతుల్లో 3 పరుగులు వచ్చాయి. స్కోర్లు సమమయ్యాయి.
అయిదో బంతికి ఉనద్కత్ ఔట్. చివరి బంతి వేయబోతూ హర్షల్.. బిష్ణోయ్‌ను మన్కడింగ్ చేశాడు. కానీ అది నాటౌట్ అని తేలింది.
మళ్లీ బంతి వేయగా.. అవేష్ షాట్ ఆడలేకపోయినా బై కోసం ప్రయత్నించాడు. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చురుగ్గా స్పందించి రనౌట్ చేయలేకపోవడంతో మ్యాచ్ లఖ్‌నవూ సొంతమైంది.