Last Updated:

Pakistan:పాకిస్తాన్‌లో పెట్రోల్ కోసం ప్రజల పడిగాపులు..బంకులవద్ద క్యూ కట్టిన ప్రజలు..

పాకిస్తాన్‌లోపెట్రోల్‌ కోసం ప్రజలు పెట్రోల్‌ పంపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్‌ కొరత విపరీతంగా ఏర్పడింది.

Pakistan:పాకిస్తాన్‌లో పెట్రోల్ కోసం ప్రజల పడిగాపులు..బంకులవద్ద  క్యూ కట్టిన ప్రజలు..

Pakistan:పాకిస్తాన్‌లోపెట్రోల్‌ కోసం ప్రజలు పెట్రోల్‌ పంపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్‌ కొరత విపరీతంగా ఏర్పడింది.

పాకిస్తాన్‌లో పలు చోట్ల మూతపడ్డ  పెట్రోల్ బంకులు..(Pakistan)

కొన్ని నగరాల్లో స్టాక్‌ లేనందున పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి.

తెరిచి ఉన్న పెట్రోల్‌ బంకుల వద్ద చాంతండంత లైన్లలో ప్రజలు పెట్రోల్‌ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పలు నగరాల్లో పెట్రోల్‌ కోసం ప్రజలు కొన్ని గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం చమురు మార్కెటింగ్‌ కంపెనీలు సరఫరా తగ్గించేశాయని పాక్‌ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

దీనితో ప్రజల్లో ఆందోళన మొదలైంది.

మీడియాలో వార్తలు వెలువడిన వెంటనే ప్రజలు ఎక్కడ పెట్రోల్‌ దొరుకుతుందో అక్కడికి పరుగులు తీశారు.

పాకిస్తాన్ లో పెట్రోల్ బంకులవద్ద పెరిగిపోయిన రద్దీ..

దీనితోపెట్రోల్‌  బంకుల వద్ద రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.

పాకిస్తాన్‌ ఒక వైపు ఆర్థిక సంక్షోభంతో పాటు మరో వైపు పెట్రోల్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

దేశంలోనే అత్యధిక రద్దీకలిగిన రాష్ట్రం  పంజాబ్‌. దీని రాజధాని లాహోర్‌.

ఈ నగరంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్‌ స్టేషన్‌లు మూతపడ్డాయి.

పరిమిత స్థాయిలో మాత్రమే స్టాక్‌ అందుబాటులో ఉంది.

పెట్రోల్‌ దొరకడం లేదని ఉన్నా పెద్ద పెద్ద క్యూలో గంటలతరబడి నిలబడాల్సి వస్తోందంటూ ఫిర్యాదులు చేస్తున్నారు.

జనాభా అధికంగా కలిగిన లాహొర్‌, గుజ్రన్‌వాలా, ఫైసలాబాద్‌లలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.

ఇక్కడి పెట్రోల్‌ పంపుల్లో నిల్వలు పూర్తిగా అడుగంటాయి.

మహా అయితే రెండు రోజుల అవసరాలకు సరిపోతే అదే ఎక్కువ.

చమురుమార్కెటింగ్‌ కంపెనీలు సరఫరా నిలిపివేశాయని పెట్రోల్‌ పంపు యజమానులు చెబుతున్నారు.

గుజ్రన్‌వాలా నగరంలో 60నుంచి 70 శాతం పెట్రోల్‌ స్టేషన్లలో నో స్టాక్‌ బోర్డులు కనిపించాయి.

పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఒకారా, షాహివాల్‌తో పాటు ఇతర నగరాల్లో ఇదే సీన్‌ కనిపించింది.

పాకిస్తాన్ లో పెట్రోల్ కొరతలేదన్న మంత్రి ముసాదిక్ మాలిక్ ..

పెట్రోలియం మంత్రి ముసాదిక్‌ మాలిక్‌ పెట్రోల్‌ కొరత లేదని స్పష్టం చేశారు.

మూడువారాలకు సరిపడ నిల్వలు ఉన్నాయని ప్రజలను శాంతిపర్చే ప్రయత్నం చేశారు.

ఇప్పటికే చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ముందుస్తు హెచ్చరికలు కూడా చేశాయి.

చమురు రంగం త్వరలోనే కుప్పకూలుతుందని హెచ్చరించింది.

ముడిచమురు కొనుగోలు చేద్దామంటే డాలర్లు లేవని స్పష్టం చేసింది.

దీంతో పాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి డాలర్లపై ఉన్న ఆంక్షలను తొలగించింది.

దీంతో పాకిస్తాన్‌లో డాలర్‌ మారకంలో రూపాయి చారిత్రక కనిష్ఠానికి పడింది.

ప్రస్తుతం స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ పాకిస్తాన్‌ వద్ద చేతిలో డాలర్ల లేవు.

కేవలం 3.68 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉన్నాయి.

ఇవి కేవలం 21 రోజుల దిగుమతికి మాత్రమే సరిపోతాయి.

అందకే పాక్‌ సెంట్రల్‌ బ్యాంకు ఈ డాలర్లను ఆచితూచి ఖర్చు పెడుతోంది.

ఇటీవలే పాకిస్తాన్‌ ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు 35 రూపాయలు పెంచినట్లు ప్రకటించింది.

పాకిస్తాన్‌ లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం..

పాకిస్తాన్‌ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది.

ఒక వైపు డాలర్‌ మారకంతో రూపాయి భారీగా క్షీణించింది. ద్రవ్యోల్బణం కోరలు చాచుతోంది. ఇంధన కొరత తీవ్రంగా ఉంది.

ఐఎంఎఫ్‌ పాకిస్తాన్‌తో కలిసి పనిచేస్తామని చెబుతూనే ముందుగా తాము

విధించిన నిబంధనలు అమలు చేయాలని షరతు విధించింది.

ప్రస్తుతం స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ పాకిస్తాన్‌ వద్ద విదేశీ మారకద్రవ్యం నిల్వలు

కేవలం 3.68 బిలియన్‌ డాలర్లకు దిగివచ్చాయి. ఈ నిధులతో కేవలం మూడు వారాలపాటు నెట్టుకురావచ్చు.

ప్రస్తుతం పాకిస్తాన్‌ ఆశలు అన్నీ ఐఎంఎఫ్‌పైనే ఉన్నాయి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/