Rahul Gandhi: ‘ధింసా’ నృత్యం చేసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో జోష్ తో కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలో సాగుతున్న జోడోయాత్రలో రుద్రారంలో రాహుల్ గాంధీ భారత్ జోడో గిరిజనుల సాంప్రదాయ నృత్యం ‘ధింసా’లో పాల్గొన్నారు.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో జోష్ తో కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలో సాగుతున్న జోడోయాత్రలో రుద్రారంలో రాహుల్ గాంధీ భారత్ జోడో గిరిజనుల సాంప్రదాయ నృత్యం ‘ధింసా’లో పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు.
సంగారెడ్డిలో జరిగిన భారత్ జోడో యాత్ర సందర్భంగా టీ విరామం సమయంలో ఏర్పాటు చేసిన థింసా కళాకారుల నృత్య ప్రదర్శనను రాహుల్ జి ఆసక్తిగా తిలకించారు. లయబద్ధంగా అడుగులు కలుపుతూ కళాకారులు చేస్తున్న నృత్యాన్ని తిలకించిన అయన వారి అడుగుల్లో అడుగులు వేస్తూ నృత్య ప్రదర్శనలో పాల్గొని అందరిని ఆకట్టుకున్నారు. ఈ ప్రాచీన కళారూపం గురించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాహుల్ కు వివరించారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క తదితరులు కూడ ఈ సందర్బంగా నృత్యం చేసి కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
जब Dhimsa की ताल पर ताल मिलाई @RahulGandhi ने…
तेलंगाना के लोक नृत्य ने बिखरे अपने रंग।#BharatJodoYatra pic.twitter.com/RwFolU6n1H
— Congress (@INCIndia) November 3, 2022