Supreme Court: తెలంగాణా సర్కార్ పై సుప్రీం ఆగ్రహం
తెలంగాణా సర్కార్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగట్టింది.
New Delhi: తెలంగాణా సర్కార్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగట్టింది. ఉమ్మడి ఆంధ్ర విభజన సమయంలో ఆంధ్ర నుండి 84మంది విద్యుత్ ఉద్యోగులు రిలీవ్ అయ్యారు. అయితే వారికి పోస్టింగులు ఇచ్చేందులో టిఎస్ ప్రభుత్వం కాలయాపన చేసింది. దీంతో వ్యవహరాం సుప్రీం కోర్టుకెక్కింది. ఇప్పటికే పిటిషన్ లో పేర్కొన్న మేర 84మందికి పోస్టింగ్ లు ఇవ్వాలంటూ గతంలోనే ఆదేశాలు జారీ చేసివున్నారు.
అయినా కూడా సర్కారు పట్టించుకోకపోవడాన్ని ధర్మాసనం తీవ్రంగా పరిణిగించింది. చివరి సారిగా పేర్కొంటున్నాం అంటూ ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ధిక్కారం కింద విద్యుత్ శాఖ అధికారులకు జైలు శిక్షే పరిష్కారమని న్యాయస్ధానం వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను ఉద్ధేశపూర్వకంగా ఉల్లంఘించారని ఉత్తర్వుల్లో పేర్కొనింది. రెండు వారాల్లో జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయాలంటూ, చివరి అవకాశంగా తెలంగాణ సర్కార్ కు తేల్చి చెప్పింది.
ఇది కూడా చదవండి: దీపావళి టపాసులు… ఢిల్లీ వాసులకు నొ చెప్పిన సుప్రీంకోర్టు..