Published On:

Pappu Royal Rowdy Sheeter: రౌడీ షీటర్ ను చితకబాదిన క్రికెట్ ప్లేయర్స్!

Pappu Royal Rowdy Sheeter: రౌడీ షీటర్ ను చితకబాదిన క్రికెట్ ప్లేయర్స్!

Rowdy Sheeter Pappu Yadav Beaten by Local Guys: రౌడీ షీటర్ ను చితకబాదారు క్రికెట్ ప్లేయర్స్. ఈ ఘటన తిరుపతిలో జరిగింది. ఆదివారం రాత్రి తిరుపతిలోని కొత్త రోడ్డు సమీపంలో స్థానిక యువత గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకుంటున్నారు. అక్కడికి చేరుకున్న రౌడీ షీటర్ పప్పు రాయల్ క్రికెటర్స్ తో గొడవకు దిగాడు. తాను మద్యం సేవించాలని వెంటనే గ్రౌండ్ ఖాలీ చేయాలని వార్నింగ్ ఇచ్చాడు. క్రికెట్ ప్లేయర్స్ కాస్త ఓపిక పట్టినా.. రౌడీ షీటర్ మరింత రెచ్చిపోయాడు. సహనం కోల్పోయిన యువత.. రౌడీ షీటర్‌ను చావబాదారు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.

 

నిన్న రాత్రి తిరుపతిలోని కొత్త రోడ్డు సమీపంలో క్రికెట్ ఆడుతున్న యువకులతో మద్యం మత్తులో ఉన్న రౌడీ షీటర్ పప్పు రాయల్‌ గొడవకు దిగాడు. తాను మద్యం తాగాలి, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. యువకులు అలానే క్రికెట్ ఆడుతుండగా.. వెళ్లలేదంటే కోడుతానంటూ తన అనుచరులతో వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు. మాటమాట పెరగడంతో రౌడీ షీటర్ పప్పు రాయల్‌ను క్రికెట్ ఆడుతున్న యువకులు చితకబాదారు. దాంతో అతడికి గాయాలు అయ్యాయి.

 

పప్పు రాయల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. గత కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ నేతలపై పప్పు రాయల్ దాడిచేసాడు. ఇతడికి చాలా గొడవల్లో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.