Last Updated:

 Samsung Galaxy A56 5G: మీ మైండ్ బ్లాక్.. సామ్‌సంగ్ నుంచి సరికొత్త ఫోన్.. అప్‌గ్రేడ్లు అదిరిపోయాయ్..!

 Samsung Galaxy A56 5G: మీ మైండ్ బ్లాక్.. సామ్‌సంగ్ నుంచి సరికొత్త ఫోన్.. అప్‌గ్రేడ్లు అదిరిపోయాయ్..!

 Samsung Galaxy A56 5G: భారతదేశంలో ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలే. అందుకనే వారు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలంటే బడ్జెట్ హై ప్రయారిటీ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సామ్‌సంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేయనుంది. A సిరీస్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ని త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. ఇది Samsung Galaxy A56 5G పేరుతో రానుంది. అలానే ఈ ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సామ్‌సంగ్ గెలాక్సీ A సిరీస్‌కి చెందిన కొత్త 5G ఫోన్ త్వరలో మార్కెట్‌లోకి రావచ్చు. రాబోయే ఈ ఫోన్ పేరు Samsung Galaxy A56 5G. ఫోన్ లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం.. ఈ రాబోయే ఫోన్ FCC సర్టిఫికేషన్‌లో లిస్ట్ అయింది. జాబితా ప్రకారం ఫోన్ మోడల్ నంబర్ SM-A566E/DS. ఫోన్ కనెక్టివిటీ వివరాలు ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ బ్లూటూత్ SIGలో కూడా జాబితా చేశారు. ఈ ఫోన్ మార్కెటింగ్ పేరు Galaxy A56 5G అని నిర్ధారించింది.

నివేదిక ప్రకారం.. 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగి ఉంది. కంపెనీ  ఈ ఫోన్ GSM, WCDMA, LTE FDD, 5G మొబైల్ కనెక్టివిటీతో వస్తుంది. 5G బ్యాండ్‌ల గురించి మాట్లాడితే ఈ ఫోన్ n1, 3, 5, 7, 8, 20, 28, 38, 40, 41, 66, 77, 78లకు సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కాకుండా, కంపెనీ బ్లూటూత్, GNSS, NFC, Wi-Fi (802.11.b/g/n/a/ac/ax) కూడా ఫోన్‌లో అందుబాటులో ఉంటాయి. EP-TA800 అడాప్టర్‌తో ఈ ఫోన్‌ ఛార్జింగ్ స్పీడ్ 25 వాట్స్.

అయితే FCC డేటాబేస్ ప్రకారం ఈ ఫోన్ 10V 4.5A ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో 45 వాట్ల వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ ఉంటుంది. IECEE సర్టిఫికేషన్ కూడా Samsung Galaxy A56 5G 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని తెలిపింది. MIIT సర్టిఫికేషన్ ప్రకారం ఈ ఫోన్ 4905mAh బ్యాటరీతో వస్తుంది. ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ గీక్‌బెంచ్‌లో కూడా కనిపించింది. ఈ జాబితా ప్రకారం ఫోన్ Exynos 1580 SoC చిప్‌సెట్, 8 GB RAMతో రావచ్చు. OS విషయానికొస్తే ఫోన్ ఉత్తమ One UI 7తో ఆండ్రాయిడ్ 15 అవుట్ ది బాక్స్‌తో నడుస్తుంది.