Last Updated:

Samsung Upcoming Mobiles: సామాన్యులకు పండగే.. సామ్‌సంగ్ నుంచి నాలుగు కొత్త ఫోన్లు.. ఫీచర్లు చూశారా..!

Samsung Upcoming Mobiles: సామాన్యులకు పండగే.. సామ్‌సంగ్ నుంచి నాలుగు కొత్త ఫోన్లు.. ఫీచర్లు చూశారా..!

Samsung Upcoming Mobiles: టెక్ దిగ్గజం సామ్‌సంగ్ భారత్ మార్కెట్లో నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుంది. దీనిలో సామ్‌సంగ్ Galaxy A06 5G, Galaxy F06 5G, Galaxy F16 5G, Galaxy M16 5G ఉన్నాయి. ఫోన్ లాంచ్ తేదీని ఇంకా ధృవీకరించలేదు. ఇంతలో ఇంటర్నెట్‌లో కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. దీనిలో సామ్‌సంగ్ ఇండియా పేజీ లైవ్ అవుతుంది. వీటి ప్రకారం ఈ ఫోన్‌ల మోడల్ నంబర్‌లు SM-A066B/DS, SM E066B/DS, SM-E166P/DS, SM-M166P/DS.

బ్లూటూత్ SIG లిస్టింగ్ Galaxy A06 5G మోడల్ నంబర్ SM-A066B/DS, Galaxy F06 5G SM-E066B/DSతో మార్కెట్‌లోకి ప్రవేశిస్తుందని ధృవీకరించింది.  కొద్ది రోజుల క్రితం వచ్చిన లీక్‌లో SM-E166P/DS మార్కెటింగ్ పేరు Galaxy F16 5G,  SM-M166P/DS మార్కెటింగ్ పేరు M16 5G అని చెబుతున్నారు. ఈ మోడల్ నంబర్‌లతో ఈ ఫోన్‌లు కూడా BISలో లిస్ట్ అయ్యాయి. ఫీచర్ల గురించి మాట్లాడితే సామ్‌సంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో మోడల్ నంబర్ మినహా ఇతర సమాచారం ఇవ్వలేదు.

సామ్‌సంగ్ Galaxy A06 5G స్మార్ట్‌ఫోన్ ఇటీవల గీక్‌బెంచ్ డేటాబేస్‌లో గుర్తించారు. ఈ లిస్టింగ్ ప్రకారం.. కంపెనీ ఫోన్‌లో 4 GB RAM,  డైమెన్షన్ 6300 చిప్‌సెట్‌ను అందించబోతోంది. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిగ్ 15 ఆధారంగా OneUI 7లో పని చేస్తుంది. నివేదిక ప్రకారం Galaxy A06 5G, F06 5G ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లతో రావచ్చు. వీటిలో మీరు 6.7 అంగుళాల LCD ప్యానెల్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా,  8 మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌ని చూడవచ్చు. ఫోన్ బ్యాటరీ 5000mAhగా ఉంటుంది, ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

సామ్‌సంగ్ Galaxy F16 5G కూడా MediaTek 6300 ప్రాసెసర్‌తో రావచ్చు. దీని ర్యామ్ 8 GB వరకు ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. లీకైన నివేదికల ప్రకారం Galaxy F16 5G, M16 5G గెలాక్సీ A16 5G  రీబ్రాండెడ్ వెర్షన్‌లు కావచ్చు. Galaxy A16 5G 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, AMOLED డిస్ప్లే,  5000mAh బ్యాటరీ వంటి అనేక గొప్ప ఫీచర్లతో మార్కెట్లోకి వస్తుంది.