Last Updated:

Smriti Mandhana: ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా స్మృతి మంధాన

Smriti Mandhana: ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా స్మృతి మంధాన

Smriti Mandhana ICC Women’s ODI Cricketer of the Year 2024: ఐసీసీ మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా భారత మహిళా క్రికెటర్, కెప్టెన్ స్మృతి మంధాన ఎంపికైంది. ఈ మేరకు ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వన్డేలో తన దైన రికార్డను నెలకొల్పింది. ఈ మేరకు 2024 ఏడాదిలో స్మృతి మంధాన .. 13 ఇన్నింగ్స్‌లు ఆడి 747 పరుగులు చేసింది. ఒకే క్యాలండర్ అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ గా నిలిచింది.

ఇదిలా ఉండగా, స్మృతి మంధాన తర్వాత లారా వోల్వార్డ్ 679 రన్స్, టామీ బ్యూమాంట్ 554, హేలీ మాథ్యూస్ 469 పరుగులు చేశారు. కాగా, స్మృతి మంధాన .. 57.86 సగటు, 95.15స్టైక్ రేట్ సాధించింది. ఇందులో నాలుగు వన్డే సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు చేయడం గమనార్హం. అత్యధికంగా ఒక్క మ్యాచ్‌లో 136 పరుగులు సాధించింది.