Last Updated:

Samsung Galaxy S25 Offers: సామ్‌సంగ్ అదరగొట్టింది.. గెలాక్సీ ఎస్25 ప్రీ-బుకింగ్స్‌పై ఆఫర్లే ఆఫర్లు..!

Samsung Galaxy S25 Offers: సామ్‌సంగ్ అదరగొట్టింది.. గెలాక్సీ ఎస్25 ప్రీ-బుకింగ్స్‌పై ఆఫర్లే ఆఫర్లు..!

Samsung Galaxy S25 Offers: సామ్‌సంగ్ ఇటీవల తన కొత్త ఫ్లాగ్‌షిప్ Samsung Galaxy S25 5G సిరీస్‌ ఫోన్లను విడుదల చేసింది. ఇందులో కంపెనీ గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్, గెలాక్సీ S25 అల్ట్రా 5G అనే మూడు ఫోన్‌లు ఉన్నాయి. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే సామ్‌సంగ్ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ల ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

సామ్‌సంగ్ Galaxy S25 5G సిరీస్‌లో మల్టీ AI ఫీచర్లు ఉంటాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ మీకు అనేక కొత్త అనుభవాలను అందించబోతోంది. ఇప్పుడు మీరు అన్ని మెయిన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల నుండి ఈ సిరీస్‌లోని ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ ఆర్డర్ చేయచ్చు.

గెలాక్సీ ఎస్25 సిరీస్ కోసం ప్రీ-బుకింగ్‌పై సామ్‌సంగ్ కస్టమర్లకు కొన్ని అద్భుతమైన ప్రీ-ఆర్డర్ డీల్‌లను కూడా అందిస్తోంది. మీరు Galaxy S25 Ultraను ముందస్తుగా బుక్ చేసుకుంటే, మీకు రూ.21000 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. మరోవైపు, మీరు Galaxy S25 లేదా Galaxy S25 Plus లను ముందస్తుగా బుక్ చేసుకుంటే, మీకు వరుసగా రూ. 11,000 , రూ. 12,000 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. ఇది కాకుండా మీరు 9 నెలల నో-కాస్ట్ EMI ద్వారా Samsung Galaxy S25 Plus పై రూ. 7,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ను రెండు స్టోరేజ్ వేరియంట్లతో పరిచయం చేసింది. దీనిలో 12GB+256GB ధర రూ.80,999. అదే సమయంలో దాని 12GB + 512GB వేరియంట్ ధర రూ. 92,999. మనం Galaxy S25 గురించి మాట్లాడుకుంటే.. ఇందులో కూడా మీకు రెండు స్టోరేజ్ వేరియంట్‌లు లభిస్తాయి. ఇందులో 12GB+256GB ధర రూ.99,999 కాగా, దాని 12+512GB వేరియంట్ ధర రూ.1,11,999.

సామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో మూడు వేరియంట్లు ఉంటాయి. ఇందులో 12GB + 256GB వేరియంట్ ధర రూ.1,29,999, 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,41,999. దాని టాప్ వేరియంట్ 12GB + 1TB మోడల్ ధర రూ.1,65,999. సామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ సేల్ ఫిబ్రవరి 7, 2025 నుండి భారతదేశంలో ప్రారంభమవుతుంది.