Last Updated:

Pushpa 2 OTT: ‘పుష్ప 2’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

Pushpa 2 OTT: ‘పుష్ప 2’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

Pushpa 2 Locks OTT Release Date: పుష్ప 2 మూవీ లవర్స్‌కి సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్‌. గత కొద్ది రోజులుగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం ఓటీటీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వారందరికి గుడ్‌న్యూస్‌ అందించింది సదరు సంస్థ. కాగా అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీసు వద్ద సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంత కాదు. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా రికార్డు మీద రికార్డులు కొల్లగొడుతోంది.

ఒక్కొక్కొ రికార్డును బ్రేక్‌ చేస్తూ బాక్సాఫీసు వసూళ్ల ఊచకోత చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా టాప్‌ 2 ప్లేస్‌లో ఉంది. గతేడాది డిసెంబర్‌ 5న విడుదలైన ఈ సినిమా ప్రీమియర్స్‌తోనే బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో మూవీ చూసేందుకు ఆడియన్స్‌ థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో ఫస్ట్‌డే నే ఈ చిత్రం రూ. 290 కోట్ల గ్రాస్‌ వసూళ్లు భారీ ఓపెనింగ్‌ ఇచ్చింది. ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్స్‌ చేసిన తొలి ఇండియన్‌ సినిమాగా కూడా పుష్ప 2 చరిత్ర సృష్టించింది.

తొలి రోజు ఈ మూవీ అరుదైన రికార్డ్స్‌ సాధిస్తూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. సంక్రాంతి సందర్భంగా అదనంగా 20 నిమిషాల జత చేసి రీలోడెడ్‌ వెర్షన్‌ ప్రదర్శించింది మూవీ టీం. ఈ రీలోడెడ్‌ వెర్షన్‌కి కూడా థియేటర్‌లో మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఇప్పటికీ ఈ మూవీ థియేట్రికల్‌ రన్‌ సక్సెస్‌ ఫుల్‌గా కొనసాగుతుంది. అయితే ఈ మూవీ థియేటర్లో ఉండగానే ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్‌. మూవీ విడుదలైన దాదాపు రెండు నెలలు కావోస్తోంది. దీంతో ఈ సినిమాను జనవరి 30 నుంచి స్ట్రీమింగ్‌ ఇవ్వబోతున్నట్టు తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది.

దీంతో ఓటీటీ ప్రియులంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఆ రోజే అన్ని భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది. రీలోడెడ్‌ వెర్షన్‌తోనే ఓటీటీలోకి వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అప్‌డేట్‌తో మూవీ లవర్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. కాగా ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 1831 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ చేసినట్టు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ వెల్లడించారు. దీంతో దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ సినిమా పుష్ప 2 ఉండగా.. రూ. 2000 కోట్ల గ్రాస్‌తో అమిర్‌ ఖాన్‌ దంగల్‌ మూవీ మొదటి స్థానంలో ఉంది.