Rashmika Mandanna: గాయం నుంచి ఎప్పటికి కోలుకుంటానో ఆ దేవుడికే తెలియాలి
Rashmika Mandanna Shared her Health Update: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఆస్పత్రిలో చేరింది. తన కాలికి గాయం అయినట్టు ఇటీవల సోషల్ మీడియాలో చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా కాలికి బ్యాండెజ్ వేసుకుని ఉన్న ఫోటోలు షేర్ చేసింది. తాను కొత్త సంవత్సరాన్ని గాయంతో మొదలుపెట్టానందూ నిరాశ వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె కాలుకు బ్యాండెజ్ వేసుకుని కనిపించింది. “అవును.. నాకు హ్యాపీ న్యూ ఇయర్ ఇలా మొదలైంది. జిమ్‌లో శిక్షణ తీసుకుంటుండగా గాయపడ్డాను. ప్రస్తుతం నేను రెస్ట్ మోడ్‌లో ఉన్నాను.
దీనికి వారాలు పడుతుందా? నెలలు పడుతుందా? అనేది ఆ దేవుడికే తెలియాలి. అంతా ఒకే అయ్యాక వెంటనే థమా, సికిందర్, కుబేరా సిసినిమా సెట్‌కి వెళుతాను” అని పోస్ట్‌లో పేర్కొంది. “అలాగే తన వల్ల సినిమా షూటింగ్‌లకి ఆలస్యం అవుతుండటంతో తన డైరెక్టర్స్‌ని రష్మిక క్షమాపణలు కోరింది. నా కాలు యాక్షన్ సీక్వెన్స్‌కి కోసం ఫిట్ కాగానే షూటింగ్‌కి వచ్చేస్తానంటూ వివరణ ఇచ్చింది. ఇంతలో మీకు ఏమైనా ఎమర్జేన్సీ ఉంటే.. అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఆ లోపు వీలైనంత త్వరగా కోలుకునేందుకు ట్రై చేస్తాను” అంటూ రాసుకొచ్చింది.
ఇటీవల పుష్ప 2తో బిగ్గెస్ట్ బ్లాకబస్టర్ అందుకున్న రష్మిక.. ప్రస్తుతం బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ సికిందర్, ధనుష్, నాగార్జున కుబేర చిత్రాల్లో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న సికిందర్‌లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే ఇందులో రష్మిక పలు పోరాట సన్నివేశాల్లోనూ కనిపించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటుంది. ఈ క్రమంలో ఆమె గాయపడింది. కాగా సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా విడుదల చేస్తామని మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది. అయితే రష్మిక గాయం కారణంగా కొన్ని వారాల పాటు విశ్రాంతికి తీసుకోనుంది. మరి ఇది మూవీ షూటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆమె లేని సన్నివేశాలు చేసిన మళ్లీ రష్మిక కోలుకుని యాక్షన్ సీన్స్ నటించేంత ఫిట్ కావాలంటే చాలానే టైం పడుతుంది. ఈ క్రమంలో సికందర్ రంజాన్‌కి రెడీ అవుతుందా? లేదా? అనేది సందేహమే అంటున్నాయి సినీవర్గాలు.