Rashmika Mandanna Photos: చేతిలో గులాబీతో ముసిముసి నవ్వుతున్న రష్మిక – ఎవరిచ్చారంటే!

Rashmika Mandanna Latets Photos: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్‌ను ఆస్వాదిస్తుంది

సౌత్, నార్త్‌లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతుంది

దీంతో రష్మిక మార్కెట్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఉంది, అదే రేంజ్లో ఆమె సినిమాలకు కూడా సంతకం చేస్తుంది

గతేడాది పుష్ప 2తో ఇండస్ట్రీలో హిట్ కొట్టింది, ఈ ఏడాది ఛావా మరో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది

ఈ ఏడాది ప్రారంభంలో జిమ్‌లో వర్కౌట్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే

కాలి గాయం కారణంగా కనీసం నడవలేని స్థితిలో ఉన్న రష్మిక ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది

అప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తున్న రష్మిక తాజాగా క్యూట్ ఫోటోలు షేర్ చేసింది

చేతిలో గులాబితో ముసిముసిగా నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది, దీనికి ఆమె ఇచ్చిన క్యాప్షన్ ఆస్తిగా ఉంది

నీ కోసం నువ్వు చివరి సారిగా గులాబి పువ్వు ఎప్పుడు కొన్నావ్? ఇది నిన్ను నువ్వు అభినందించుకోవడానికి, కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఒక సున్నితమైన జ్ఞాపకం అంటూ క్యాప్షన్ ఇచ్చింది.