Rashmika Mandanna: జీవితంలో ఏదీ శాశ్వతం కాదు – సికందర్ మూవీ ఫలితంపై రష్మిక రియాక్షన్

Rashmika Mandanna About Her Career: రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస హిట్స్‌తో దూసుకుపోతోంది. పుష్ప 2, ఛావాలతో వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్‌తో సౌత్, నార్త్‌లో దూసుకుపోతున్న రష్మిక తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. ఈ సందర్బంగా తన కెరీర్, సక్సెస్‌పై స్పందిస్తూ ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది. అలాగే సల్మాన్ ఖాన్‌తో నటించి సికందర్ మూవీ ఫలితంపై స్పందించింది.
“జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే విషయం నాకు తెలుసు. దాన్ని గ్రహిస్తే ఒత్తిడి అనేదే ఉండదు. దీనిపై గతంలోనూ ఎన్నోసార్లు మాట్లాడాను. ఒకరోజు మనకు అనుకూలంగా అనిపిస్తుంది. మరుసటి రోజు అంతా మారిపోతుంది. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మా కుటుంబం, స్నేహితుల నుంచి మద్దతు ఉండటం నా అదృష్టం. ఒడుదొడుకులను ఎదుర్కొవడంలో అండగా ఉంటారు. నిజానికి నేను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కనీసం సినిమా రంగంలోకి రావాలనే ప్రణాళిక కూడా ఎప్పుడు వేసుకోలేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎంత అదృష్టవంతురాలినో అనిపిస్తుంది” అని చెప్పుకొచ్చింది.
కెరీర్ విషయంలో తానేప్పుడు స్థిరంగా ఉంటానని, ఈ విషయంలో అందరికి ఇచ్చే సలహా కూడా ఇదేనంది. కూర్గ్ లాంటి చిన్న పట్టణంలో పుట్టిను తాను, నేడు ఈ స్థాయిలో ఉన్నానంటే అదే కారణమన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకుసాగాలని పేర్కొంది. ఈ ప్రయాణంలో కఠినమైన పాఠాలు ఉండవని, అన్నీ విలువైనవే ఉంటాయన్నారు. ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండటానికి ప్రయత్నించాలని, ఇతరులను సంతోషపెట్టాలనే భారాన్ని మాత్రం మోయకండన్నారు. మీ ఆనందంపై దృష్టిపెట్టాలని ఆమె పేర్కొంది.