Last Updated:

Flipkart Smart TV Deals: పక్కా నమ్మరు.. ఆఫర్లు అరాచకం.. స్మార్ట్‌ఫోన్ ధరకే 43 ఇంచెస్ టీవీలు..!

Flipkart Smart TV Deals: పక్కా నమ్మరు.. ఆఫర్లు అరాచకం.. స్మార్ట్‌ఫోన్ ధరకే 43 ఇంచెస్ టీవీలు..!

Flipkart Smart TV Deals: కొత్త టీవీని కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్న వ్యక్తుల కోసం ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన డీల్‌ను తీసుకొచ్చింది. ఇక్కడ మీరు 43 అంగుళాల స్మార్ట్ టీవీని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చు. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ సామ్‌సంగ్, ఎల్‌జీ, ఏసర్ స్మార్ట్ టీవీలపై పెద్ద తగ్గింపులను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ జాబితాలో ఒక టీవీపై రూ.26 వేలు తగ్గింపు ఇస్తోంది.  మీరు చాలా కాలంగా పెద్ద స్క్రీన్ టీవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఈ డీల్స్ మిస్ అవ్వకండి. ఇప్పుడు మూడు ఉత్తమ డీల్స్ గురించి తెలుసుకుందాం.

SAMSUNG 43 Inch Full HD LED Smart TV
సామ్‌సంగ్ ఈ 43 అంగుళాల టీవీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో చాలా చౌక ధరకు అందుబాటులో ఉంది. కంపెనీ ఈ టీవీని రూ. 37,900కి పరిచయం చేసింది కానీ ఇప్పుడు మీరు కేవలం రూ. 25,990కే ఈ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు. నో కాస్ట్ EMI ఎంపికతో మీరు నెలకు రూ. 8,664 చెల్లించి ఈ టీవీని మీ ఆర్డర్ చేయచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా టీవీలో 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ ఇస్తుంది.

LG UR7500 43 Inch  HD 4K LED TV 
ఈ LG TV ఫ్లిప్‌కార్ట్‌లో కూడా చాలా చౌక ధరలో లభిస్తుంది. టీవీపై 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది, ఆ తర్వాత దాని ధర రూ. 29,990 అవుతుంది. అయితే కంపెనీ దీనిని రూ.49,990కి లాంచ్ చేసింది. కంపెనీ ఈ టీవీపై రూ. 5,400 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది, ఇది ధరను మరింత తగ్గిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ టీవీలో 5శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది.

Acer G Plus 43 Inch Ultra HD 4K LED Google TV
ఈ ఏసర్ టీవీపై ఫ్లిప్‌కార్ట్ 50 శాతం కంటే ఎక్కువ తగ్గింపును అందిస్తోంది. కంపెనీ ఈ టీవీని రూ.47,999కి లాంచ్ చేసింది కానీ ఇప్పుడు ఈ టీవీ కేవలం రూ.21,000కే అందుబాటులో ఉంది. అంటే ఈ టీవీకి రూ.26 వేలకు పైగా తగ్గింపు లభిస్తోంది. ఇది మాత్రమే కాదు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఈ టీవీపై రూ. 5,400 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇది ధరను మరింత తగ్గిస్తుంది.