Last Updated:

Samsung Galaxy S24 Ultra Price Drop: ఆఫర్ బలేగా ఉంది పుష్ప.. సామ్‌సంగ్ 200 MP కెమెరా ఫోన్‌పై రూ.345 వేల డిస్కౌంట్..!

Samsung Galaxy S24 Ultra Price Drop: ఆఫర్ బలేగా ఉంది పుష్ప.. సామ్‌సంగ్ 200 MP కెమెరా ఫోన్‌పై రూ.345 వేల డిస్కౌంట్..!

Samsung Galaxy S24 Ultra Price Drop: సామ్‌సంగ్ త్వరలో తన కొత్త Galaxy S25 సిరీస్‌ను గ్లోబల్ మార్కెట్లో ప్రారంభించబోతోంది. లాంచ్ తేదీని కూడా కంపెనీ అధికారికంగా ప్రకటించింది. జనవరి నాలుగో వారంలో అంటే జనవరి 22న జరిగే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో కొత్త డివైజ్‌లు లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. ఈ సారి ఈ సిరీస్‌లో మూడు కాదు నాలుగు ఫోన్లు లాంచ్ అవుతాయి. ఇందులో పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్‌లు, కెమెరాలో మార్పులు, బ్యాటరీ లైఫ్, డిజైన్‌ను చూడవచ్చని భావిస్తున్నారు. ఈ లాంచ్‌కు ముందే, అమెజాన్ ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా S సిరీస్ హై ఎండ్ డివైస్‌పై నేరుగా రూ.34 వేల తగ్గింపును ఇస్తోంది.

Samsung Galaxy S24 Ultra 5G Offers
అమెజాన్ గత సంవత్సరం ప్రారంభించిన S సిరీస్ హై-ఎండ్ గ్యాడ్జెట్ Samsung Galaxy S24 Ultra 5Gపై పెద్ద తగ్గింపులను అందిస్తోంది. ఎలాంటి ఆఫర్ లేకుండా ఫోన్ పై నేరుగా రూ.34 వేలు తగ్గింపు ఉంది. ఫోన్ ప్రస్తుతం ప్లాట్‌ఫామ్‌లో కేవలం రూ. 1,01,999కి అందుబాటులో ఉంది. అయితే కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 1,35,999కి విడుదల చేసింది. కంపెనీ ఈ ఫోన్‌లో అనేక ప్రత్యేక AI ఫీచర్లను అందిస్తుంది. ఇది 2025లో కూడా ఉత్తమమైన హై ఎండ్ డివైజ్‌గా నిలిచింది. ఫోన్ కెమెరా చాలా ప్రత్యేకమైనది, దీనితో మీరు S పెన్ను కూడా పొందుతారు, ఇది వినియోగదారు అనుభవాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళుతుంది. ఈ ఫోన్ తాజా ఐఫోన్‌తో నేరుగా పోటీపడుతుంది.

Samsung Galaxy S24 Ultra 5G Specifications
సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా పెద్ద 6.8-అంగుళాల QHD+ AMOLED ప్యానెల్‌ను పొందుతోంది, రిఫ్రెష్ రేట్ 120 Hz, పీక్ బ్రైట్నెస్ 2,600 నిట్స్. ఫోన్ భద్రత కోసం ఇందులో కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ ఉంది. అలానే ఇది క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌తో ఉంటుంది. ఇది 12 GB RAM+ 1 TB వరకు స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది.

ఈ సామ్‌సంగ్ మొబైల్ 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలానే ఈ ఫోన్ Galaxy AI ఫీచర్‌లకు సపోర్ట్ ఇస్తుంది. రాబోయే వారాల్లో OneUI 7 అప్‌డేట్‌ను కూడా పొందుతుంది. Android 15-ఆధారంగా OneUI 7 అప్‌డేట్ తర్వాత, స్మార్ట్‌ఫోన్ మరో 6 OS అప్‌డేట్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఫోటోగ్రఫీ కోసం దీనిలో 200MP కెమెరా ఉంది. 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్‌ను పొందుతుంది. ఇది 3x ఆప్టికల్ జూమ్‌తో అదనపు 10MP టెలిఫోటో లెన్స్‌ను కూడా కలిగి ఉంది.